Home

»

Tv News

Illu illalu pillalu : మళ్లీ పెళ్లి మాటెత్తిన ప్రేమ.. సేనాపతి ఊహించని రచ్చ!

Jul 28, 2026 10:13AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -534 లో..... ప్రేమ కోసం ధీరజ్ చీర తీసుకొని వస్తాడు. ప్రొద్దున ఇద్దామనుకున్నా కానీ ఆలోపే నువ్వు చీర సెలెక్ట్ చేసుకున్నావ్.. అందుకే ఇప్పుడు ఆ చీరపై కావాలనే కూల్ డ్రింక్ పడేలా చేసానని అంటాడు. ఒరేయ్ నేను కూడా సాయంత్రం ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక విషయం చెప్పాలని అనుకున్నానని ధీరజ్ కోసం ప్రేమ డ్రెస్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఏంటి విషయం అన్నావని ధీరజ్ అడుగుతాడు. అప్పుడు మనం ఇద్దరం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసాయి కదా అందుకే మళ్ళీ పెళ్లి చేసుకుందామని ప్రేమ అనగానే ఒక్కసారి చేసుకున్నందుకే ఇలా ఉంది.. మళ్ళీ పెళ్లా అని ధీరజ్ అంటుంటే ఒరేయ్ అలా అంటావేంట్రా అని ప్రేమ నవ్వుతుంది. 

మరొక వైపు తన పుట్టింటి వాళ్ళు వచ్చారని వేదవతి చాలా హ్యాపీగా ఉంటుంది. అమూల్య ఇప్పటివరకు తీసిన ఫొటోస్ అన్నీ నా ఫోన్ లో స్టేటస్ పెట్టు అని వేదవతి అంటుంది. రెండు కుటుంబాలు కలిసిపోయాయని అందరికి తెలిసేలా స్టేటస్ పెట్టుకుంటుందని వల్లి అనుకుంటుంది.ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేయడానికి సిద్ధం అవుతారు. ఏంటి నిజంగానే కలిసి పోయావా అని భద్రవతితో వల్లి అంటుంది. ముందు మగవాళ్ళు అందరు కూర్చొని భోజనం చేస్తారు. సేనాపతికి భద్రవతి సైగ చేస్తుంది. ప్రేమని తనతో పాటు గదికి తీసుకొని వెళ్తుంది. కామాక్షి భర్త భాస్కర్ తో సేనాపతి మాట్లాడుతాడు. ఏం చేస్తున్నావ్ భాస్కర్ అంటాడు సివిల్ కాంట్రాక్టు అని అతను చెప్తాడు.

కూతురికి మంచి జీవితం ఇచ్చి కొడుకులని కూలీలలను చేసాడు. ఒక్కడు గౌరవంగా లేడు అని సేనాపతి అంటాడు. మాటలు అదుపులో పెట్టుకోండి అని ధీరజ్ కోప్పడతాడు. మరొకవైపు నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా అని ప్రేమని భద్రవతి అడుగుతుంది. ధీరజ్ చాలా బాగా చూసుకుంటాడని ప్రేమ చెప్తుంది. మరొకవైపు నా కూతురిని నువ్వే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావని ధీరజ్ ని సేనాపతి తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com