
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.... మాధవ దగ్గరికి చక్రి వచ్చి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది.. అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి.. వచ్చి సంతకాలు పెడితే కోర్ట్ కి పంపిస్తామని అంటున్నారని చెప్పి చక్రి బాధపడతాడు. తనకి మాధవ దైర్యం చెప్తాడు. మహాని బయటకి తీసుకొని వచ్చి తన ప్రేమ విషయం చెప్పాలని చక్రి అనుకుంటాడు. మహా ఆఫీస్ అయ్యాక తన ఫ్రెండ్ తో బయటకి వస్తుంది. అప్పుడే విక్కీ తనని డ్రాప్ చేస్తానని అంటాడు. అంతలోనే చక్రి వస్తాడు. మీ అన్నయ్య వచ్చాడని విక్కీ అనగానే కజిన్ అంటే అత్త కొడుకు కూడా అవుతుందిరా దరిద్రుడా అని విక్కీని చక్రి తన మనసులో తిట్టుకుంటాడు.
సరే మీ అన్నయ్య వచ్చాడు కదా తనతో వెళ్ళు అని విక్కీ అంటాడు. కొంచెం మీతో పర్సనల్ గా మాట్లాడాలని మహాని చక్రి పార్క్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఎవరో ఒకరు డిస్టబ్ చేస్తూనే ఉంటారు. తన ప్రేమ విషయం చెప్పినట్లు ఉహించుకుంటాడు చక్రి. తీరా చెప్పే టైమ్ కి చక్రి వాళ్ళ ఫ్రెండ్ తన లవర్ తో పాటు పార్క్ కి వచ్చి గొడవపడతారు. నన్ను బలవంతంగా ప్రేమించమని అంటున్నారని ఆ అమ్మాయి అనగానే అలా ఎలా ప్రేమిస్తారని మహా అంటుంది. ఇక అప్పటికే చక్రి తన మనసులో మాట చెప్పలేకపోతాడు. ఆ తర్వాత చక్రి ఇంకా ఇంటికి రాలేదని మాధవ కన్నా వెయిట్ చేస్తారు. అప్పుడే కేశవ వచ్చి ఏమైందని అడుగుతాడు. లాయర్ ఫోన్ చేసినప్పటి నుంచి చక్రి డల్ గా ఉన్నాడని మాధవ చెప్తాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. చక్రి ఒక్కడే బయట కూర్చొని బాధపడతాడు. మాధవ వచ్చి చక్రికి నచ్చజెప్పుతాడు.
మరుసటిరోజు చక్రితో మాధవ మాట్లాడుతాడు. ఎందుకు అన్నయ్య నేనంటే తనకి ఇష్టం లేదు అందరు అంటే ఇష్టమే నేనంటే మాత్రమే ఇష్టం లేదని చక్రి ఎమోషనల్ అవుతాడు. తరువాయి భాగంలో మహా లాయర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే.. ఇప్పుడు విడాకులు అవసరమా అని నారాయణ అడుగుతాడు. చక్రి, మహా ఇద్దరు జడ్జ్ ముందు నిల్చొని ఉంటారు. చక్రికి మాధవ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీ ప్రేమ నిజం అయితే విడాకులు జరగవనే మాటలు గుర్తుచేసుకుంటాడు చక్రి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






