Home

»

Tv News

Brahmamudi : చావు బతుకుల్లో రాజు.. హాస్పిటల్లో అసలు నిజం బయటపెట్టిన చలపతి!

Jul 15, 2026 11:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1084 లో... హాస్పిటల్ లో రాజుని ఆ పరిస్థితిలో చూసి ఇందుకి చలపతి నిజం చెప్పేస్తాడు. అది విని ఇందు షాక్ అవుతుంది. రాజు నీ మేనత్త కొడుకు మా కొడుకు కాదు మేం పెంచుకున్నామని చలపతి అంటాడు. ప్లీజ్ అమ్మ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని‌ ఇందుతో చలపతి అంటాడు. మరొకవైపు అపర్ణ కిచెన్ లో ఉండగా రేఖ వెళ్తుంది. ఏంటి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నావ్.. ఈ ధైర్యానికి కారణం ఆ రాజు గాడే కదా వాడికి ముందు భయమంటే ఏంటో చూపిస్తానని రేఖ అంటుంది.

దాంతో అపర్ణ టెన్షన్ పడి రాజుకి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చెయ్యకపోయేసరికి అప్పుడే ఇందుకి కాల్ చేస్తుంది. తను కూడా లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ఇందు నా బావని క్షేమంగా ఉంచు దేవుడా అని ఇందు మొక్కుకుంటుంది. మళ్ళీ రాజు దగ్గరికి ఇందు వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని ఇందుని చలపతి కోప్పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకి వస్తాడు. ప్రమాదం ఏం లేదు వేరే రూమ్ కి మారుస్తాను.. వెళ్లి చూడండి అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మ అని చలపతి అనగానే బావని తీసుకొని నా ఇంటికి వెళ్తానని ఇందు అనగానే వాళ్ళు షాక్ అవుతారు.

అంకుల్  రాజు మీ దగ్గర ఉంటేనే ప్రాబ్లమ్ కానీ నా దగ్గరుంటే నేను బాగా చూసుకుంటానని ఇందు చెప్తుంది. ధైర్యం లేని మాకు రాజు ఒక ధైర్యం కల్పించాడు.. ప్లీజ్ అంకుల్ మాకు రాజు వల్లే ఒక ఆశ కలిగింది.. మీరే అన్నారు కదా ఎప్పుడు రాజు ఎప్పుడు మా గురించే అలోచించేవాడని.. అందుకే నేను తీసుకొని వెళ్తానని ఇందు అంటుంది. తరువాయి భాగంలో రాజు డిశ్చార్జ్ అయి చలపతి ఇంటికి వస్తాడు. అక్కడే ఇందు కూడా ఉంటుంది. రాజును చూడడానికి రేఖ వస్తుంది. ఎక్కడ లక్కీ విషయం బయటపెడతానోనని ఇదంతా చేసావ్ కదా ఆంటీ కానీ ఆ నిజం ఇంకొకరికి కూడా తెలుసని రాజు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com