
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -320 లో..... గంగ లేట్ గా వచ్చినందుకు తనకి రంగాకి విశ్వ పనిష్ మెంట్ ఇస్తాడు. అప్పుడే జయని తీసుకొని రుద్ర వస్తాడు. జయ నిద్ర మత్తులో ఉంటుంది. నువ్వు రేపటి నుంచి త్వరగా లేవాలి.. జాగింగ్ కి వెళ్ళాలి.. అసలు నీ డ్రీమ్ ఏంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఏమైనా ఉంటే చెప్పమని విశ్వ అడుగుతాడు. ఎందుకు ఉండదు మావయ్య అక్కడ విశ్వనాథ్ కూతురు కదా అని రుద్ర అనగానే బాగా ఆడుకుంటున్నారని జయ అనుకొని రన్నింగ్ నాన్న అంటుంది.
సరే వెళ్లి రన్నింగ్ చెయ్యమని విశ్వ చెప్తాడు. వేరే దారి లేక జయ వెళ్లి చేస్తుంది. గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే సుధా వచ్చి జ్యూస్ ఇస్తుంది. విశ్వకి ఒక జ్యూస్ ఇస్తుంది. అది కూడా గంగకి ఇవ్వమని విశ్వ పాజిటివ్ గా మాట్లాడుతాడు. రేపటి నుంచి త్వరగా రమ్మని గంగకి విశ్వ చెప్తాడు. మరొకవైపు కార్తీక్ కి ప్రమీల టిఫిన్ పెడుతుంది. తను వెళ్తుంటే దేవుడికి మొక్కుకొని వెళ్ళండి. మా అత్తయ్య ఎప్పుడు ఈ విభూది భాను గారికి పెడుతుందని అనుకొని కార్తీక్ కి కూడా విభూది పెడుతుంది. అది కళ్ళలో పడుతుంటే ఊదుతుంది ప్రమీల. అప్పుడే శకుంతల వాళ్ళు అందరు వస్తారు. వాళ్ళని అలా చూసి శకుంతల తప్పుగా అర్ధం చేసుకొని ప్రమీలని కొడుతుంది.
మేడమ్ ని ఏం అనకండి అని కార్తీక్ అంటాడు. వీరు, ఇషిక ఇంకా గొడవ పెద్దది అయ్యేలా మాట్లాడతారు. అప్పుడే రుద్ర వస్తాడు. సర్ వీళ్ళందరు మేడమ్ ని తిడుతున్నారని కార్తీక్ చెప్తాడు. కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రమీల గురించి ఇషిక తప్పుగా మాట్లాడుతుంటే తనపై రుద్ర కోప్పడతాడు. నా భార్య ఏం తప్పుగా మాట్లాడిందని సూర్య అనగానే తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతాడు. అదే మాట నేను అంటే ఏం చేస్తావని శకుంతల అంటుంది. ప్రమీల అలా చెయ్యడానికి కారణం ఉందని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






