Home

»

Tv News

Podharillu : శైలును పెళ్లికూతురిని చేసిన వైనం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ!

Aug 18, 2026 12:40PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  పొదరిల్లు  Podharillu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 181 లో... నారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా అని పంతులు అడగడంతో తాయారు ఎగతాళిగా.. రావడానికి ఎవరున్నారని అంటుంది. మరోవైపు మహా రుద్రాంబిక అమ్మవారి దగ్గర తన బాధను చెప్పుకుంటూ.. నేను చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. అయినా పెద్ది కోసం ఈ పని చేయాలని అనుకుంటున్నాను అమ్మా అని మొక్కుతుంది. వెంటనే గుడి గంట మోగడంతో అమ్మవారి అంగీకారంగా భావించిన మహా, నిప్పుల చట్టీతో గాయత్రితో కలిసి వస్తుంది. మహా ఎండలో చెప్పులు లేకుండా నడవడం చూసి చక్రి తట్టుకోలేకపోతాడు. బిందెతో నీళ్లు తెచ్చి ఆమె నడిచే దారి మొత్తం తడుపుతూ సహాయం చేస్తాడు. చివరకు మహా, గాయత్రి మూడు ప్రదక్షిణలు పూర్తి చేయడంతో పూజ పూర్తవుతుంది. 

 

ఇక మరోవైపు శైలు, వరాలు హోమం కోసం వస్తారు. వరాలు ప్రేమగా మాట్లాడటంతో శైలుకు అనుమానం వస్తుంది. ఎప్పుడూ నన్ను కొడతానని బెదిరించే నువ్వు ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావేంటి.. ఏదో చేస్తున్నారు.. చెప్పండి అని శైలు అడుగుతుంది. వరాలు మాత్రం..మేం ఏం చేయం.. హోమం చేయడానికి వచ్చామని కవర్ చేస్తుంది. శైలు కూడా కేశవతో తన పెళ్లి జరగాలని అమ్మవారిని మొక్కుకుంటుంది. ఇదే సమయంలో సురేష్ వచ్చి.. అన్నీ రెడీ అయ్యాయి.. దాన్ని తీసుకురండి అని వరాల చెవిలో చెప్పి వెళ్లిపోవడంతో శైలుకు మరింత అనుమానం వస్తుంది. మరోవైపు నిప్పుల చట్టీ వల్ల మహా చేతులు కాలిపోవడంతో చక్రి ఊరంతా ఐస్ కోసం వెతికి, చివరకు నారాయణ సలహాతో వైన్స్ నుంచి ఐస్ తీసుకొచ్చి ఆమె చేతులకు రాస్తాడు. అన్నయ్య నీళ్లు పోశాడు కాబట్టి నడవగలిగావ్ వదిన అని కన్నా అనడంతో మహా చక్రిని ప్రేమగా చూస్తుంది. 

 

చివరగా కొత్త జంట అమ్మవారికి నైవేద్యం పెట్టాలని పంతులు చెప్పడంతో, మహా చేతికి గాయం ఉందని చక్రి అంటాడు. అయితే నైవేద్యం పెట్టకపోతే అమ్మవారి అనుగ్రహం ఉండదని పంతులు చెప్పడంతో మహా ఎలా చేయాలో అడుగుతుంది. నేను సాయం చేస్తాలే అమ్మా అని పెద్ది చెప్పడంతో నైవేద్యం ఏర్పాట్లు మొదలవుతాయి. మరోవైపు పెళ్లి గెటప్‌లో ఉన్న ప్రకాష్‌ను చూసి శైలు.. మీ పెళ్లా అన్నయ్య.. పెళ్లికూతురు ఎవరు అని పదేపదే అడుగుతుంది. సురేష్ ఆమెను పక్కకు తీసుకెళ్లి.. ఎందుకు అలా పిలుస్తున్నావని అడుగుతాడు. చివరకు వరాలు.. ఇంత వరకు అన్నయ్య అని పిలిచింది చాలు.. ఇక పిలవకు అని అంటుంది. శైలు మాత్రం.. పెళ్లికూతురు ఎక్కడ అని అడగడంతో శేఖరం అసలు నిజం చెప్తాడు. నువ్వే పెళ్లికూతురివి అమ్మా అని చెప్పగానే శైలు మొదట నవ్వుతుంది. కానీ జోక్ కాదు.. సీరియస్‌గా చెప్తున్నానని శేఖరం చెప్పడంతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com