Home

»

Tv News

Illu illalu pillalu : ప్రేమ కోసం రాత్రిపూట రహస్యంగా వెళ్లిన ధీరజ్.. ఆ ట్విస్ట్ ఊహించలేరు!

Aug 18, 2026 12:36PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  552 లో.. వేదవతి, నర్మద ఇద్దరు గోరింటాకు నూరుకుంటూ ఉండగా.. ప్రేమ–ధీరజ్‌ల గొడవ గురించి ఆలోచిస్తూ వేదవతి బాధపడుతుంది. నర్మద ఆమెను సరదాగా ఆటపట్టించి నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. ఆషాడమాసంలో భర్త చేతితో గోరింటాకు పెట్టించుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని అంటారు. అలాంటి సమయంలో ప్రేమ, ధీరజ్‌ గొడవపడి దూరంగా ఉండటం బాధగా ఉందని వేదవతి చెప్తుంది. ఈ మాటలను ధీరజ్ కూడా వింటాడు. మరోవైపు వల్లి కూడా చందుతో గోరింటాకు పెట్టించుకోవాలని ప్రయత్నిస్తుంది. మన కాపురం కూడా గోరింటాకులా పండాలి బా.. నాకు ఈ జ్ఞాపకం కావాలని అడుగుతుంది. కానీ చందు కోపంగా..ఆ అవకాశాన్ని నువ్వే పోగొట్టుకున్నావని అంటాడు. దాంతో వల్లి ఇంట్లో అందరూ తప్పులు చేశారని గుర్తుచేస్తూ..నేను చేసిన తప్పుకే నాకు ఇంత శిక్ష అయితే, వాళ్ల తప్పులకు ఎందుకు శిక్ష లేదని ప్రశ్నిస్తుంది. చివరకు చందు గోరింటాకు గిన్నె పట్టుకున్న సమయంలో వల్లి తెలివిగా తన చేతిపై గోరింటాకు పడేలా చేసుకుంటుంది. నా మొగుడు నాకు గోరింటాకు పెట్టాడు.. అది చాలు అంటూ వల్లి సంతోషపడుతుంది. 

 

ఆ తర్వాత చందు తన తమ్ముడు ధీరజ్‌కి.. నాలాంటి పరిస్థితి నీకు రాకూడదు. ఏదో ఒకటి చేసి ప్రేమను ఇంటికి తీసుకురా. నీ కాపురాన్ని చక్కదిద్దుకోమని సలహా ఇస్తాడు. దాంతో ధీరజ్‌కు వేదవతి మాటలు గుర్తుకొస్తాయి. రాత్రి గోరింటాకు తీసుకుని ఎవరికి తెలియకుండా భద్రావతి ఇంట్లోకి వెళ్లి ప్రేమ గదిలోకి చేరుకుంటాడు. ప్రేమ నిద్రపోతుండటంతో.. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నావు.. నువ్వేమో ప్రశాంతంగా నిద్రపోతున్నావని ప్రేమగా అనుకుంటాడు. ఆమెను ముద్దు పెట్టుకోవాలని అనిపించినా, అపార్థం చేసుకుంటుందని ఆగిపోతాడు. తర్వాత నిద్రలో ఉన్న ప్రేమ చేతికి గోరింటాకు పెట్టి, తన ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. మన పేర్లు ఎప్పటికీ కలిసే ఉండాలి. నువ్వు నన్ను ద్వేషించినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు తిరిగి మన ఇంటికి రావాలని మనసులో చెప్పుకుంటూ మరో చేతికి కూడా గోరింటాకు పెడతాడు ధీరజ్. ప్రేమను వదిలి వెళ్లాలనిపించకపోయినా.. చివరకు బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

 

తెల్లవారిన తర్వాత ప్రేమ తన చేతికి గోరింటాకు ఉండటం చూసి కోపంగా కిందకు వస్తుంది. నా చేతికి గోరింటాకు ఎవరు పెట్టారని ప్రేమ అడుగుతుంది. ఇంట్లో ఎవరూ పెట్టలేదని చెప్పడంతో భద్రవతి వెంటనే.. ఇది కచ్చితంగా ధీరజ్‌గాడి పనే అంటుంది. కానీ శారదాంబ మాత్రం గోరింటాకు బాగా పండిందని చూసి సంతోషిస్తుంది. నీ మొగుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో దీనితోనే తెలుస్తోంది. భార్యకు దక్కాల్సిన ఆనందాన్ని నీకు అందించడానికి వచ్చి గోరింటాకు పెట్టి వెళ్లాడని శారాదాంబ చెప్తుంది. రేవతి కూడా.. ధీరజ్‌కి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతుంది. ప్రేమ తన చేతిని చూసుకుంటే అరచేతిలో కళ్యాణ్  అని రాసి ఉండటంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ ఆగాల్సిందే ‌.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com