Home

»

Tv News

Godhavari : జానుకు ఎదురుచూపులు.. సూర్య-నిత్యల ఎంగేజ్మెంట్ చూసి షాకైన వైనం!

Aug 18, 2026 12:45PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  గోదావరి Godhavari . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  85 లో.మురళికి పోలీసులు కొట్టిన దెబ్బలకి భోజనం చెయ్యరాకుండా ఉంటుంది. కొంచం వాడికి భోజనం తినిపించమని పెద్దావిడ అంటుంది.‌బావ తినిపించాలా అని నందు అడుగుతుంది. వద్దులే అని మురళి అంటాడు. వాడు అలాగే అంటాడులే కానీ నువ్వు తినిపించమని పెద్దావిడ అనగానే నందు తినిపిస్తుంది. దాంతో మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్ కి దిష్టి తీసి నిత్య లోపలికి తీసుకొని వస్తుంది.

 

నువ్వు సింహాద్రి కొడుకువి.. ఎలా ఉండాలి సింహంలాగా ఉండాలని కళ్యాణ్ చెంప చెల్లుమనిపిస్తుంది నిత్య. ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి.. ప్లాన్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలి కదా అని కోప్పడుతుంది. మనకి అందరికి ఆ కుటుంబం మీద కోపం ఉంది కానీ అది చూపించే టైమ్ ఇది కాదు.. బావతో నా పెళ్లి అయ్యే వరకు ఓపికగా ఉండండి అని నిత్య చెప్తుంది. శభాష్ నా కూతురు అనిపించుకున్నావని సింహాద్రి అంటాడు. మరొకవైపు సూర్య ఇచ్చిన చీర కట్టుకొని జానూ మురిసిపోతుంది. చీరలో దిగిన ఫొటోస్ అన్ని సూర్యకి పంపిస్తుంది. అది సూర్య చూసి చాలా బాగున్నావని అంటాడు. ఈ చీర ఎక్కడిది జాను అని నందు అడుగుతుంది. మొన్న తీసుకున్నానని జానూ చెప్తుంది.

 

అప్పుడే ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి ఏమనుకుంటున్నారు అమ్మ.. మీరు ఆ కళ్యాణ్ పై పోలీస్ కంప్లైంట్ ఇస్తారు.. మళ్ళీ మీ అమ్మ వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకొని అతన్ని విడిపించిందని చెప్తాడు. అప్పుడే శారద ఇంటికి వస్తుంది. ఏంటి అమ్మ నువ్వు ఇలా భయపడుతున్నావ్.. ఎందుకు వాడిని విడిపించావని జాను అడుగుతుంది. వాళ్ళు ఈ కుటుంబంపై పగ పడితే నేను తట్టుకోలేనని శారద ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో జాను స్వీట్ బాక్స్ తీసుకొని సూర్య వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. ఈ రోజు మా పెళ్లికి ఒప్పుకుంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే అత్తవాళ్ళ ఇల్లు ఇక్కడే అనుకుంటూ సూర్య ఇంటికి వెళ్తుంది జాను. ఇక జాను వెళ్ళేలోపు సూర్యకి నిత్య కి ఎంగేజ్మెంట్ అవుతుంది. అది చూసి ఎంత మోసమని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com