.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -172 లో....చక్రి, కేశవకి సురేష్ కనిపిస్తాడు. తనతో ఇద్దరు ఒక ఆటాడుకుంటారు. ఏంట్రా రెచ్చిపోతున్నారు అసలు దానికి నీకు పెళ్లి ఎలా అవుతుందో చూస్తానని సురేష్ అనగానే తనకి ఏమైనా అయిందో మీ సంగతి చెప్తానని కేశవ వార్నింగ్ ఇస్తాడు. దానికి త్వరగా పెళ్లి చేసెయ్యాలి లేదంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారని సురేష్ అనుకుంటాడు.
మరొకవైపు మహా వచ్చేసరికి ఇంట్లో ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటారు. దాంతో మహా వారిపై కోప్పడుతుంది. మేం అన్నయ్య పెళ్లి గురించే ఆలోచిస్తున్నామని కేశవ అంటాడు. ఇప్పుడు మనకి పెద్ది జాతకం కావాలని మహా అంటుంది. దాని గురించి మాకెవరికి తెలియదని అంటారు. అప్పుడే మాధవ వస్తాడు. మాధవని మహా జాతకం అడుగుతుంది. మా నాన్నకి తెలుసని మాధవ చెప్తాడు. నారాయణ దగ్గరికి వెళ్లి మహా అడుగుతుంది. ఆ పెట్టెలో ఉంటుందని నారాయణ చెప్తాడు. అందరు వెతుకుతారు కానీ ఎక్కడ కనిపించదు. దాంతో నారాయణ మందు మహా దాచిపెట్టి నువ్వు ఇప్పుడు జాతకం వెతికి పెడితేనే ఇస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది.
ఆ తర్వాత జాతకం దొరుకుతుంది. మాధవని పని దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు పెళ్లి చూపులు అని మహా చెప్తుంది. వద్దని మాధవ అనగానే ఇప్పుడు ఇదంతా ఒప్పుకోకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మహా అంటుంది. దాంతో మాధవ ఒప్పుకుంటాడు. పెళ్లి చూపులకి మాధవ రెడీ అవుతాడు. అమ్మాయి వాళ్ళే మన ఇంటికి ఎందుకు వస్తున్నారని నారాయణ అడుగుతాడు. ఇల్లు గురించి తెలియాలని రమ్మన్నానని మహా అంటుంది. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళు వస్తారు. తరువాయి భాగంలో మాధవ జాతకం ప్రకారం ఈ ఇంట్లో ఉన్నతకాలం అతనికి పెళ్లి కాదు.. ఇంట్లో ఎవరికి పెళ్లి కాదని పంతులు చెప్తాడు. దాంతో రాత్రి అందరి పడుకున్న తర్వాత మాధవ ఒక లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
