Home

»

Tv News

Jayam serial :వంశీ, జయల ఎంగేజ్‌మెంట్ ఫిక్స్..స్కెచ్ ఆర్టిస్ట్ కోసం రుద్ర, గంగల వేట!

Aug 5, 2026 9:56AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -338 లో.. నా కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోయి నా పరువు పోయిందని విశ్వ అంటాడు. నీ పరువు గౌరవం నేను నిలబెడతానని పెద్దసారు అంటాడు వంశీ, జయలకి ఎంగేజ్మెంట్ జరగాలి. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్తాడు. నా మేనకోడలు.. నా ఇంటికి కోడలు గా రావాలని ఆశపడుతున్నానని పెద్దసారు అంటాడు. ఎవరికీ ఇష్టం ఉండదు. పెద్దసారు నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పరు. రాఘవ, ఇందుమతి మరొకవైపు విశ్వ, సుధా ఇరుకుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు.

ఆ తర్వాత సారీ వదిన ఆ టైమ్ లో ఏం చెయ్యలేకపోయామని శకుంతలతో రాఘవ అంటాడు. నా ఇష్టంతో పనేంటి అని శకుంతల కోపంగా వెళ్తుంది. మీరేం కంగారు పడకండి తనని నేను ఒప్పిస్తానని పెద్దసారు అంటాడు. మరొకవైపు ఇలా జరిగింది ఏంటని రుద్ర, గంగ, రంగా అనుకుంటారు. ఎలాగైనా ఆ జయ ఈ ఇంటికి కోడలు అవొద్దని అనుకుంటారు. మరుసటిరోజు నాకు ఇప్పుడు విశ్వనాథ్ ఆస్తులతో పాటు విజయంద్ర ప్రతాప్ ఆస్తులు కూడా వస్తాయని జయ పొగరుగా ఉంటుంది. లక్ష్మీ, పైడిరాజుతో పొగరుగా మాట్లాడుతుంది జయ.

దాంతో అప్పుడే గంగ వస్తుంది. జయ ముందు గంగ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. దాంతో జయకి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. విశ్వ రావడం గమనించిన గంగ సైలెంట్ గా ఏంటి జయ ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం ఇక అని అంటుంది. నీతో నాకేంటి నువ్వు ఎక్కడ నేను ఎక్కడ అని జయ అంటుంది. అప్పుడే విశ్వ వచ్చి జయపై కోప్పడతాడు. భలే ఇరికించావ్ చెల్లి అని గంగతో రంగా అంటాడు. తరువాయి భాగంలో స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర గంగ  ఎందుకు ఉందని కనుక్కోవడానికి రుద్ర, గంగ, రంగా వెళ్తారు. మరొకవైపు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని చంపడానికి వీరు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com