Home

»

Tv News

పెద్ద హీరోయిన్ ఐపోయిందా ఏంటి... బాబు ఉన్నాడనే సూసైడ్ చేసుకోలేదు..

Aug 4, 2026 12:43PM

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో సీరియల్ యాక్టర్స్ అంతా కనిపించారు. వీళ్ళే స్కిట్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇక గెస్ట్ గా ఇంద్రజ ప్రస్తుతానికి జబర్దస్త్ షోకి వెళ్లిపోయారు కాబట్టి హీరోయిన్ రాశిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.  ముందుగా తెలుగు నటుల్లో ముఖ్యమైన వాళ్ళ పాత్రల గెటప్స్ తో వచ్చారు ఈ ఎపిసోడ్ కి వచ్చినవాళ్లంతా. ఇందులో మరీ ముఖ్యంగా ఆటో రాంప్రసాద్ గెటప్ ఫుల్ వెరైటీగా ఉంది. అతన్ని చూస్తే ఏ గెటప్ అన్నది కూడా ఎవరూ గుర్తు పట్టలేరు. ప్రదీప్ అందరి గెటప్స్ ని వాళ్ళ వాళ్ళ డైలాగ్స్ ని బట్టి అంచనా వేసాడు కానీ రామ్ ప్రసాద్ గెటప్ ని గుర్తు పట్టలేక పోయాడు. దాంతో రామ్ ప్రసాద్ రివీల్ చేసాడు. "నువ్వింకా మైకేల్ జాక్సన్ ని గుర్తుపట్టలేదు కదూ " అనేసరికి "మైకేల్ జాక్సనా" అంటూ పక్కనే ఉన్న సీరియల్ నటి శిరీష్ షాకై అరిచింది. "ఎన్టీఆర్ గెటప్ వేసాను " అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు.

ఇక ఈ ప్రోమోలో లాస్ట్ సెగ్మెంట్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళ కెరీర్ జర్నీలో పడిన ఇబ్బందులు ఎదుర్కున్న మాటలు అన్నీ కూడా మళ్ళీ గుర్తుచేసుకుని చెప్పారు.   "హీరోయిన్ అవడానికి జస్ట్ ముందు ఒక సాంగ్ కోసం ఒక మూవీలో అడిగారు. ఆ సినిమాలో ఒక మెయిన్ ఆయన ఏంటి వెంకటేష్ మీ అమ్మాయి అప్పుడే పెద్ద హీరోయిన్ ఐపోయిందా ఏంటి అప్పుడే ఐస్ బాల్స్ అవి మెయింటైన్ చేస్తున్నావ్ అని నా ముందు అడిగారు. ఆ రోజు డిసైడ్ అయ్యాను " అంటూ రాశి చెప్పుకొచ్చారు. తర్వాత సీరియల్ నటి శిరీష చెప్పింది.  "నేను ఒక సీరియల్ చేశాక ఒకటిన్నర ఏడాది బ్రేక్ వచ్చింది.  సడెన్ గా నా డిఓస్ వచ్చినప్పుడు నెగటివ్ కామెంట్స్ పెట్టడం వంటివి చేశారు. నాకు బాబు ఉన్నాడని సూసైడ్ వరకు వెళ్ళలేదేమో" అని చెప్పుకొచ్చింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com