.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -167 లో... నారాయణ కుటుంబం గురించి వరాలు తప్పుగా మాట్లాడుతుంటే ఒకవైపు గాయత్రి మరొకవైపు మహా ఇద్దరు వచ్చి వాళ్ళకి బుద్ది చెప్తారు. మా అబ్బాయి తప్పు చేసాడని శైలు వాళ్ళ నాన్న అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గాయత్రిని తాయారు తీసుకొని వెళ్తుంది. ఎందుకు అక్కడికి వెళ్ళావని కోప్పడుతుంటే వాళ్ళ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటానని గాయత్రి అంటుంది. వాళ్ళ గురించి మనకేంటి అని తయారు అనగానే ఆ రోజు వాళ్ళు నీ గురించి అలా అనుకుంటే ఈ రోజు ఆ ఇంటికి కోడలిగా ఉండేదాన్ని అని గాయత్రి అంటుంది.
ఆ తర్వాత మహాలక్ష్మిని ఒంటరిగా పంపించొద్దు తనతో ఎవరో ఒకరు తోడుగా ఉండాలి.. చక్రి నువ్వు ముఖ్యంగా ఉండాలని మాధవ అనగానే ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య తను వీరనారి తనకి తోడు అవసరం లేదు.. నేను అయితే అసలు వెళ్ళనని చక్రి అనగానే మాధవ తనని పక్కకి తీసుకొని వెళ్లి మహాతో గడిపే టైమ్ దొరుకుతుందని ఆలోచించమని చెప్తాడు. నువ్వు ఇలా అంటున్నావని నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు అన్నయ్య.. ఇప్పుడు వెళ్లి వస్తానని చెప్పాలా అని చక్రి అనగానే వద్దని మాధవ అంటాడు. మరొకవైపు శైలుని గదిలో ఉంచి తాళం వేస్తారు. మరొకవైపు మాధవ వాళ్లు నిద్రపోకుండా ఆలోచిస్తాడు. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం.. ఒక చక్రి, మహా ఉంటారు.. మనం అందరం ఉండడం వల్లే తనని అలా అంటున్నారని మాధవ అనగానే మహా అసలు ఒప్పుకోదని చక్రి అంటాడు.
ఉదయం ఆ విషయం గురించి మహాతో మాధవ మాట్లాడుతాడు. మేం వెళ్ళిపోతాం అమ్మ మేం ఉండడం వల్లే మా గురించి ఇలా అనుకుంటున్నారని మాధవ అంటాడు. అనుకునే వాళ్ళు అనుకుంటారని మహా అంటుంది. అవన్నీ ఏం పట్టించుకోకండి అని చెప్తుంది. ఆ తర్వాత శైలుని కలవడానికి కీర్తి వెళ్తుంది. అక్కడ శైలు జరిగింది మొత్తం కీర్తికి చెప్తుంది. కీర్తి ఫోన్ నుంచి కేశవకి శైలు చేసి మాట్లాడుతుంది. నాకు పెళ్లి చూపులు అని శైలు చెప్తుంది. తరువాయి భాగంలో పెళ్లిచూపులు ఆపాలని మహా, చక్రి వెళ్తారు. అతనే అబ్బాయి అనుకుని వేరే వాళ్లతో మా కేశవ శైలు ప్రేమించుకున్నారని చెప్తాడు కానీ ఆ అబ్బాయి ఆల్రెడీ పెళ్లిచూపులకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
