Home

»

Tv News

Illu illalu pillalu : ధీరజ్ అసలు నిజం బయటపెట్టడంతో ఊహించని షాక్.. ప్రేమ షాకింగ్ రియాక్షన్!

Jul 29, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -535 లో..... ధీరజ్ ని కావాలనే సేనాపతి రెచ్చగొడుతాడు. నా కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్.. నా ఇంట్లో డ్రైవర్ గా కూడా పనికి రావని సేనాపతి అంటాడు‌. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావ్.. ఇంటికి వచ్చి గొడవ చెయ్యడం కరెక్ట్ కాదని వేదవతి అంటుంది. ఏంటే నీ కొడుకు చేసింది మోసం కాదా అని సేనాపతి అనగానే కాదు నా కొడుకు లేకపోతే ప్రేమ ఈ పరిస్థితిలో ఉండేది కాదని వేదవతి అంటుంది.

ప్రేమ ఎవరినో ప్రేమించి మోసపోయిందని వేదవతి అంటుంది. అంత దిగజారి మాట్లాడుతున్నావ్ .. నువ్వు అసలు ఆడదానివేనా అని సేనాపతి అంటాడు. ఒరేయ్ నువ్వు నోరు ముయ్ ప్రేమ నిజంగానే కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది.. వాడు ప్రేమని ఎవరికో అమ్మాడు.. అప్పుడే హోటల్ లో పోలీసుల రైడ్ జరుగుతుంది.. ఎక్కడ తనని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేస్తారోనని మా అమ్మనే నా మేనకోడలిని కాపాడమని రిక్వెస్ట్ చేస్తే నేనే పెళ్లి చేసుకున్నానని ధీరజ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి బుజ్జమ్మ నువ్వు పెళ్లి చేసావా అని రామరాజు షాక్ అవుతాడు. అంతా అబద్ధాలు అని సేనాపతి అంటాడు. వల్లి వెళ్లి ప్రేమ భద్రవతి మాట్లాడుకుంటుంటే.. మీ నాన్నని ధీరజ్ కొడుతున్నాడని చెప్తుంది. మాటామాటా పెరిగి గొడవలో సేనాపతిని ధీరజ్ నెట్టేస్తాడు. అప్పుడే ప్రేమ వస్తుంది.

ఎందుకు మా నాన్నని కొట్టావ్ రా అని అడుగుతుంది. వాడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ధీరజ్ అంటాడు. లేదమ్మ నువ్వే లేచిపోతే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడని నిందలు వేస్తున్నాడని సేనాపతి అనగానే నింద కాదు నిజమని ధీరజ్ అంటాడు. ప్రేమ షాక్ అవుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పనని మాటిచ్చావ్ కదా.. ఈ విషయం అందరికి తెలిస్తే నేను తలదించుకుంటానని తెలుసు.. అయిన ఇలా చేసావని ప్రేమ అనగానే ఇంకా వాడితో మాటలేంటని సేనాపతి అంటాడు. ధీరజ్ అతడిని కొట్టడానికి వెళ్తాడు. ధీరజ్ ని ప్రేమ కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com