.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -162 లో..... మహా బర్త్ డే కి అన్ని ఏర్పాట్లు చేస్తాడు చక్రి. మనీషా, మాధవ ఒకవైపు చక్రి మహా, ఒకవైపు కేశవ, శైలు ఒకవైపు ఇలా మూడు జంటలుగా ముచ్చట్లు పెడుతుంటే నారాయణ వాళ్ళని చూసి మురిసిపోతాడు. మహా కేక్ కట్ చేస్తుంది. విక్కీ, చక్రి ఇద్దరు ఒకేసారి కేక్ తీసుకుంటారు. ఎక్కడ మహాకి తినిపిస్తాడో అని అనుకున్న చక్రి తన చెయ్ ని విక్కీకి తగిలేటట్లు చేసి విక్కీ చేతిలోని కేక్ ని కింద పడేసేలా చేస్తాడు. ఆ తర్వాత మాధవకి మహా కేక్ తినిపిస్తుంది.
కేక్ కటింగ్ అందరు వెళ్ళిపోతారు. చక్రి, కేశవ, కన్నా మాట్లాడుకుంటారు. ఇక ఎలాగైనా మహాకి నా ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నా లాంగ్ డ్రైవ్ కి తీసుకొని వెళ్లి చెప్తానని చక్రి అనగానే అసలు వదిన నీతో లాంగ్ డ్రైవ్ కి వస్తుందా అని కేశవ, కన్నా నవ్వుకుంటారు. అప్పుడే మహా వచ్చి లాంగ్ డ్రైవ్ కి తీసుకొని వెళ్తావా అని అడుగుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. సరే అని చక్రి అంటాడు. స్కూటీ పై వెళదాం నేనే డ్రైవ్ చేస్తాననగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేయ్ అల్ ది బెస్ట్ బాగ మాట్లాడు అని కేశవ అంటాడు. ఆ తర్వాత ఇద్దరు స్కూటీపై వెళ్తారు. మహాకి చక్రి బొకే ఇచ్చి ప్రపోజ్ చేసినట్లు ఉహించుకుంటాడు. ఆ తర్వాత చక్రి తన మనసులో మాట చెప్పబోతుంటే తన అంతరాత్మ ఆపుతుంది. ఎవరు ఆపినా ఆగేది లేదు. ఈ రోజు నా మనసులో మాట చెప్పాల్సిందేనని మహా దగ్గరికి వెళ్తాడు చక్రి.
ఏంటి ఏదో చెప్పాలనుకున్నారు చెప్పండి అని మహా అంటుంది. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు లవ్ లో పడిపోయానని తన మనసులో మాట చెప్తాడు చక్రి. నీలాంటి ఫ్రాడ్ ని ఎవరు లవ్ చేస్తారని మహా అంటుంది. సాక్ష్యం కావాలా పోలీస్ స్టేషన్ కి వెళదామా అని మహా అంటుంది. కానిస్టేబుల్ తో ఫోన్ చేయించింది, ఆధార్ కార్డు ఉన్నా లేదని అబద్దం చెప్పడం అని చక్రి గురించి మహా అనగానే అప్పుడు ఉంది ఇప్పుడు లేదని చక్రి చెప్తాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడుగుతుంది. ఫోన్ లో ఆధార్ కార్డు ఉండదు. చక్రి డిలీట్ చేసింది గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదు అంటే మిమ్మల్ని నేను నమ్మట్లేదు అయిన సాయం చేసినంత మాత్రాన ప్రేమ పుట్టదు. ఇప్పుడు వచ్చి విడాకులు ఇస్తేనే నాకు పెద్ద సాయం చేసినట్లు అని మహా కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. దాంతో చక్రి బాధపడతాడు. తరువాయి భాగంలో మహాకి ఆధార్ కార్డ్ కొరియర్ వస్తుంది. అందులో వైఫ్ అఫ్ చక్రి అని ఉంటుంది. అది చూసి మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
✍️. దాసరి మల్లేష్




.webp)
.webp)
