.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -
లో.....భాగ్యం వాళ్ళ దగ్గరికి వల్లి వచ్చి బర్త్ డే పార్టీలో ఎలా గొడవ జరుగుతుందో అంతా చెప్తుంది కానీ మీరు అటువైపు రాకండి ఎందుకంటే వాళ్ళకు మీపై డౌట్ వచ్చే అవకాశం ఉందని వల్లి అంటుంది. అప్పుడే సుకన్యని తీసుకొని తిరుపతి వస్తాడు. సుకన్య డ్రెసింగ్ స్టైల్ మార్చేస్తుంది. తిరుపతి చేత బట్టలు కొనిపిస్తుంది. తన అవతారం చూసి అందరు షాక్ అవుతారు. వల్లి నువ్వు ఏంటి ఇక్కడ నన్ను ఇక్కడ చూసానని నువ్వు మర్చిపో.. నిన్ను ఇక్కడ చూసానని నేను మర్చిపోతానని తిరుపతి చెప్పి వెళ్ళిపోతాడు.
ఏంటే ఎంత బాధేసావని భాగ్యం అడుగగానే ఇరవై అయిదు వేలు అని సుకన్య చెప్తుంది. నువ్వు వాళ్ళలా కక్కుర్తి పడకు కొడితే కొండనే కొట్టాలని వల్లి చెప్తుంది. మరొకవైపు అసలు వాళ్ళు ఈ ఇంటికి వస్తాను అనడం ఏంటి.. ఇందులో ఏదో ఉంది అని ధీరజ్, సాగర్ నర్మద అంటుంటే మీకు ఏంటి మా వాళ్ళు ఒక మెట్టు దిగి వచ్చి వస్తానంటే డౌట్ పడుతున్నారని ప్రేమ అంటుంది. వాళ్ళు ఇంతవరకు మనపై ఎన్ని కుట్రలు చేసారో మర్చిపోయావా అని ధీరజ్ అంటాడు. మా వాళ్ళు మా నాన్నమ్మ కోసం ఒక మెట్టు దిగివచ్చారు. ఇందులో ఏం అనుమానం లేదని ప్రేమ కోపంగా అనేసి వెళ్తుంది. పుట్టింటి వాళ్ళని ఎవరు ఏం అన్నా ఏ అమ్మాయి పడదని నర్మద అనగానే మా ఆవిడ మాత్రం డిఫరెంట్ అత్తారింటి కోసం తన పుట్టింటోల్లని వదులుకుంటుందని సాగర్ అనగానే మామ మాట వినే అల్లుడు ఉంటే ఇలాగే ఉంటారని నర్మద అంటుంది.
ఆ తర్వాత తెల్లారితే మా అక్క వాళ్ళు వస్తున్నారని వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. పాపం ఇన్నాళ్లుగా వాళ్ళ ప్రేమ కోసం ఎదురు చూస్తుందని ధీరజ్ తో రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ తన ఇంటి వైపు చూస్తుంటే వేదవతి వస్తుంది. రేపు మన పుట్టింటి వాళ్ళు వస్తున్నారని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరుసటి రోజు తన పుట్టింటివాళ్ళు వస్తున్నారని వేదవతి అన్ని రకాల వంటలు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

