.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -62 లో.. కళ్యాణ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు. నువ్వు గ్రేట్ రా నీకు నచ్చిన అమ్మాయిని ఈ కాలేజీలో జాయిన్ అయ్యేలా చేశావని కార్తీక్ తో ఫ్రెండ్స్ అంటారు. అప్పుడే గౌతమి వస్తుంది. ఏంటీ ఫీజు కట్టావా అని గౌతమిని కార్తీక్ అడుగుతాడు. కట్టాను అయితే ఈ రోజు నీకు పార్టీ ఇస్తున్నాను నువ్వు రావాలని అంటాడు. లేదు కార్తీక్ అని గౌతమి చెప్తుంది. నువ్వు రావాలి అంతే నేను హర్ట్ అవుతానని కార్తీక్ అనగానే గౌతమి సరే అంటుంది. అప్పుడే గౌతమికి జానూ ఫోన్ చేసి అడ్మిషన్ అయితే త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. మా అక్క కాల్ చేసింది ఇంటికి వెళ్ళమని చెప్తుంది వెళ్తానని గౌతమి అంటుంది.
మీ అక్క చెప్పినట్లు వింటావా తనకి పొగరు బాగ ఉంటుంది.. మా నాన్న డబ్బు ఇస్తే వద్దని అంటుందా అని కార్తీక్ అనగానే కార్తీక్ చెంపచెల్లుమనిపిస్తుంది గౌతమి. దాంతో అందరి ముందు నన్ను కొడుతావా అని కార్తీక్ కోపంగా అక్కడ నుంచి వెళ్తాడు. మరొకవైపు జానూ ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ సెలెక్ట్ అవ్వదు దాంతో జాను డిస్సపాయింట్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే భువనతో సూర్య అటుగా వస్తాడు. భువన షాపింగ్ కి వెళ్తుంది. జాను దగ్గరికి సూర్య వచ్చి మాట్లాడుతాడు. నన్ను డ్రాప్ చెయ్ అని జాను అనగానే అమ్మ ఉందని సూర్య అనగానే సరేలే అని జాను వెళ్తుంది. అప్పుడే భువన వచ్చి ఏంటట ఆ పొగరు బోతుకి అని అడుగుతుంది. ఏం లేదు అమ్మ అని సూర్య అంటాడు.
మరొకవైపు మురళికి భోజనం తీసుకొని వెళ్ళు అని నందుకి పెద్దావిడ చెప్తుంది. ఏదో ఒకటి చెప్పి బాక్స్ ఇచ్చి పెద్దావిడ పంపిస్తుంది. నందు బాక్స్ తీసుకొని రావడం చూసి మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నందు షాప్ లోపలికి వెళ్తుంది. శాంతి కూడా బాక్స్ తీసుకొని వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక షాప్ లోపలికి వెళ్లి డోర్ వేస్తాడు. ఏంటి బావ అని నందు అడుగుతుంది. ఏం లేదు మా అమ్మ వచ్చింది అని మురళి అనగానే మీ అమ్మకి ఇప్పుడు నేను భయపడాల అని నందు అంటుంది. మురళి అన్న లేడని శాంతితో మురళి అసిస్టెంట్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
