
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-265... లో విడాకుల కౌన్సెలింగ్ కు హాజరైన చక్రి, మహాలక్ష్మీని కౌన్సెలింగ్ లో చాలా ప్రశ్నలు అడుగుతారు. నీ భర్తకు ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావని అడుగుతారు. ఆయన మంచివాడు కాదా, తాగుబోతా అని అడుగుతారు. లేదని మహా చెప్తుంది. నాకు చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయని, నా ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగిపోయిందని అందుకే విడాకులు కావాలని మహా చెప్తుంది. దీంతో చక్రిని ప్రశ్నిస్తే చూడబోతే నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేనట్లు ఉందని అంటారు. నాకు కూడా విడాకులు ఇవ్వడం ఇష్టమేనని చక్రి చెప్పడంతో మహా షాక్ అవుతుంది.
తప్పులన్నీ తనపై వేసుకున్న చక్రి నేను మంచివాడిని కాదని, ఆమెకు తగిన వాడిని కాదని చెప్తాడు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి సాయం చేయాల్సింది పోయి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నానని, తను అంత చదువు లేదని, పైసా కూడా సంపాదించలేని వాడినని అంటాడు. నాకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, కారులో ఎక్కిన ప్రతి అమ్మాయిని మాటలతో పడేయాలని చూస్తుంటానని, పెళ్లికాని అమ్మాయిలకు ఫిఫ్టీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తుంటానని అంటాడు. ఇన్ని అవలక్షణాలు ఉన్న వాడికి ఇంత మంచి అమ్మాయి తగినది కాదని, ఆమెకు విడాకులు ఇచ్చి బంధం నుంచి విముక్తి కల్పించాలని అంటాడు. దీంతో కోర్టు వాళ్లకు మరికొంత సమయం ఇస్తుంది.. వచ్చే వాయిదాకల్లా ఇదే అభిప్రాయంతో ఉంటే విడాకులు మంజూరవుతాయని చెప్తుంది.
ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముడిని ఏమైందని మాధవ్ అడగ్గా తనకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నానని చక్రి చెప్తాడు. దీంతో నారాయణ, మాధవ్ చక్రిని తిడతారు. అలా ఎలా ఒప్పుకున్నావని అడుగుతారు. తను ఏదైనా బలంగా అనుకుంటే అదే జరుగుతుందని, నీ పెళ్లి కోసమే మహాలక్ష్మీ ఇక్కడ ఉందని, మనీషాతో నీ పెళ్లి జరగబోతుంది కాబట్టి వెళ్లిపోతుందని చక్రి చెప్తాడు. మీరు రోజూ నమ్మే నిజాలే కోర్టులో చెప్పానని అంటాడు. తనకు నేనంటే ఇష్టం లేనప్పుడు ఎన్ని రోజులు దొంగ నాటకాలతో నెట్టుకురాగలనని చెప్పి చక్రి వెళ్లిపోతాడు. చక్రి కారుకు నారాయణ సైకిల్ అడ్డుపెట్టి ఆపేస్తాడు. నీ రివర్స్ డ్రామాలు నా దగ్గర కుదరవని చెప్తాడు. నువ్వు విడాకులు ఇచ్చేస్తానని బాధపడితే జాలిపడి విడాకులు వద్దంటుందని అనుకుంటున్నావా అని నారాయణ అంటాడు. మహాలక్ష్మీ అందరిలా కాదని, నువ్వు కాదన్న కోపంలో విడాకులు ఇచ్చినా ఇచ్చేస్తుందని హెచ్చరిస్తాడు. ప్రేమతో గెలుచుకోవాలి కానీ నాటకాలతో కాదని నారాయణ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
