Home

»

Tv News

Illu Illalu Pillalu: వల్లీ ప్రెగ్నెంట్..చందుకి షరతు పెట్టిన రామరాజు!

Nov 20, 2026 10:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-635 లో.... ధీరజ్ ఇంటి కోసం అంటూ రిట్జా స్కూటీ కొన్నానని చెప్తాడు. ప్రేమ కోసం ఇంట్లో వాళ్ల కోసం అంటూ ధీరజ్, రామరాజు, అమూల్య స్కూటీ ప్రమోట్ చేస్తారు. తర్వాత ప్రేమ కస్టమర్ ని రఫ్ఫాడించేస్తా అంటూ వేలకి వేలు రేట్లు చెప్పడంతో కస్టమర్ వెళ్లిపోతాడు. ఇంతలో ధీరజ్ కి సాగర్ లంచం తీసుకొని అధికారులు తీసుకెళ్లిన విషయం తిరుపతి కాల్ చేసి చెప్తాడు. దాంతో ధీరజ్ షాక్ అయి ప్రేమతో నడిపోడు లంచం తీసుకున్నాడంట, పెద్ద ఇష్యూ అయిందని ప్రేమని ఇంటికి పంపేస్తాడు. సాగర్ కోసం తను ఆఫీస్ కి వెళ్తాడు. రేషన్ ఆఫీసర్ గా ఉన్న అంజలి చందు రైస్ మిల్లు దగ్గరకు రైడ్ చేయడానికి వస్తుంది. చందు పిలిచినా అంజలి పట్టించుకోదు.

అంజలి డ్రైవర్ తో మాట్లాడితే మా మేడంకి విడాకులు అయ్యాయని చెప్పడంతో చందు షాక్ అవుతాడు. ఒక్కసారి మాట్లాడు అంజలి అని బతిమాలితే ఎందుకు మానిన గాయాన్ని రేపుతావు, గతాన్ని గుర్తు చేయకని అంజలి వెళ్లిపోతుంది. నా జీవితం బాలేదు అంజలి అని చందు అనుకుంటాడు. మరోవైపు వల్లీ నీరు మోస్తూ కళ్లు తిరిగి పడిపోతుంది.. ఆనందరావు, భాగ్యం కంగారు పడతారు. డాక్టర్ ని పిలిస్తే మీ కూతురు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో వల్లీ హ్యాపీ అవుతుంది. భాగ్యం మాత్రం నీ బాధ పంచుకోవడానికి ఒకరు వస్తున్నారా, నీ అత్తింటి వాళ్లు రానివ్వడం లేదని అంటుంది. వల్లీ మనసులో అమ్మ చెప్పిందే నిజం, నా పరిస్థితే బాలేదు ఇలాంటి టైంలో బిడ్డనా అని ఏడుస్తుంది. సాగర్ ని అధికారులు తీసుకెళ్లడంతో నర్మద ఇంటి బయటే ఏడుస్తుంది.

వేదవతి, రామరాజు, తిరుపతి కంగారుగా ఉండగా ప్రేమ వస్తుంది. ప్రేమని పట్టుకొని నర్మద ఏడుస్తుంది. రామరాజు ఫ్యామిలీ ఏడుస్తుంటే భద్రావతి డప్పు కొడుతూ రామరాజు పరువు పెద్ద కొడుకు తీసేశాడు అని వెటకారం చేస్తుంది. భద్రావతిని వేదవతి తిడితే వేదవతి వచ్చి నర్మదని కొట్టి.. నువ్వు తప్పు చేయడం వల్లే పరువు పోయిందని అంటుంది. సాగర్ ని ధీరజ్ తీసుకొస్తాడు.. భద్రావతి ఏరా నడిపోడా ఉద్యోగం పోయిందా అని నవ్వుతుంది. సాగర్ ఉద్యోగం పోయిన లెటర్ నర్మద ముఖం మీద కొట్టి ఇప్పుడు సంతోషమేనా అని అంటాడు. సాగర్ ని రామరాజు కొట్టి.. నోర్ముయ్ రా అని, సాగర్ మీద నీళ్లు పోసి లంచం బుద్ధి వదిలేస్తేనే లోపలికి రమ్మని చెప్తాడు. వల్లీ కూడా తప్పు చేసింది, నువ్వు తనని తీసుకురా నేను వీడిని రానిస్తానని చందుతో రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com