.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -634 లో.....కూరగాయలు అమ్మే ఆవిడలా రామరాజు ఇంటికి వచ్చిన వల్లి దొరికిపోతుంది. దీంతో చందు గొడవ చేస్తాడు. కానీ వల్లి మాత్రం విడాకుల పేపర్ల మీద సంతకం చేయనంటే చేయనని చెప్పేస్తుంది. నువ్వు నాకు కావాలి బా, ఈ కుటుంబం నాకు కావాలని వల్లి ప్రాధేయపడుతుంది. సంతకం పెట్టకపోతే చంపేస్తా, నువ్వు వాయిదాకు వస్తావ్ కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని చందు బయటకు వెళ్లిపోతాడు. నేను కోర్టుకు రాను, సంతకం పెట్టనని వల్లి గట్టిగా అరుస్తుంది.. ఎందుకే నా కొడుకును రెచ్చగొడుతున్నావని వల్లిని బాదేస్తుంది వేదవతి, దీంతో వల్లి పరుగులు పెడుతుంది.
సాగర్, నర్మద ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. అప్పుడే ఏసీబీ వాళ్లు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన సాగర్ టెన్షన్ తో గదిలోకి వెళ్తాడు. ఏసీబీ అంటే ఏంటో తెలియని తిరుపతి, సుక్కు కామెడీ చేస్తారు. సాగర్ ను పిలవమని వాళ్లు అడుగుతారు. సాగర్ లంచం తీసుకున్నాడు.. అతన్ని పట్టుకోవడానికి వచ్చామని ఏసీబీ ఆఫీసర్ చెప్పేసరికి అందరి మైండ్లు బ్లాంక్ అవుతాయి. నా కొడుకు లంచం తీసుకోవడం ఏంటని వేదవతి అడుగుతుంది. తను లంచం తీసుకోలేదని సాగర్ బుకాయిస్తాడు. ప్రూఫ్స్ ఉన్నాయని సాగర్ డబ్బు తీసుకుంటున్న వీడియోను ఆఫీసర్ అందరికి చూపిస్తాడు. ఈ ప్రూఫ్స్ మీ ఫ్రెండ్ ఇచ్చిందేనని చెప్తాడు. ఆ బ్యాగ్ లో క్యాష్ ఉందనే గ్యారెంటీ ఏందని సాగర్ తప్పించుకోవాలని చూస్తాడు.
మీరు రూల్స్ మాట్లాడితే మేం కూడా రూల్స్ మాట్లాడతాం.. ఇళ్లంతా చెక్ చేయండని ఆఫీసర్ చెప్తాడు. అందుకు సాగర్ ఒప్పుకోడు. కానీ లంచం తీసుకుంటే ఆ పాపం సొమ్ము నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్లి వెతకండని రామరాజు చెప్తాడు. కానీ డబ్బు దొరకదు. మీరు చాలా ప్లాన్డ్ గా ఉన్నారని, కోపరేట్ చేస్తే శిక్ష తగ్గుతుందని ఆఫీసర్ చెప్తాడు. బెదిరించి చాలు, మీకు ఏం దొరకలేదు కదా వెళ్లండని సాగర్ అంటాడు. అయితే రాత్రి మొక్కల దగ్గర సాగర్ ఏదో దాచిన విషయాన్ని నర్మద గుర్తు చేసుకుంటుంది. అక్కడికి వెళ్లి చూస్తే డబ్బు కట్టలు ఉంటాయి.. ఏం చేస్తున్నావ్ నర్మద వాళ్లకు డబ్బు ఇస్తే నా ఉద్యోగం పోతుందని సాగర్ చెప్తున్నా నర్మద వినదు. సర్ మా ఆయన లంచం తీసుకున్నాడు.. ఇదిగోండి డబ్బులు అని సాగర్ ను పట్టిస్తుంది నర్మద. డబ్బుతో పాటు సాగర్ ను ఎంక్వైరీ కోసం తీసుకెళ్తారు.
ఇటు ట్రావెల్ ఏజెన్సీలో కార్లన్నింటికీ ప్రేమ దిష్టి తీస్తుంది, కొబ్బరికాయ కొడితే చిన్న ముక్క వెళ్లి ధీరజ్ కు తగులుతుంది. కార్లకు ప్రేమ చేసిన పూజ చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ఈ రోజు మన గల్లా పెట్టే అంతా కాసులతో కళకళలాడిపోవాలని ప్రేమ అంటుంది. ఓ కస్టమర్ కాల్ చేసి కారు కావాలంటే ధీరజ్ రూ.500 తక్కువ చేసి చెప్తాడు, బిజినెస్ నీకు వదిలేస్తే కష్టమేరా అని ప్రేమ గుండెలు బాదుకుంటుంది. మరో కస్టమర్ వస్తే బాబాయి గారు మీకు బీపీ, షుగర్ ఉన్నాయా అని అడిగి కూల్ డ్రింక్ తెమ్మని ధీరజ్ ను పంపించి ముచ్చట్లు పెడుతుంది. వైజాగ్ వెళ్తే సింహాచలం, కైలాసగిరి వెళ్లాలని రూ.15 వేలు అవుతుందని, హైదరాబాద్ కూడా వెళ్తే రూ.25 వేలు అవుతుందని ప్రేమ చెప్తుంది. ఆ కస్టమర్ భార్యతో ట్రైన్ కు వెళ్లిపోదామని చెప్పేసరికి ప్రేమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO keywords:





.webp)
