
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -632 లో.. వల్లీ చందు గురించి ఆలోచిస్తూ జరిగిన గొడవ తలచుకుని బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే అంజలి అటుగా వెళ్తూ వల్లీని గుర్తుపట్టి కారు ఆపి దగ్గరకు వెళ్తుంది. మీరు చందు భార్య కదా అని అంజలి అంటే మీకు మా ఆయన ఎలా తెలుసు, మీరు ఫ్రెండ్సా అని వల్లీ అడుగుతుంది. దానికి అంజలి తెలీదు అండీ కానీ రామరాజు గారి పెద్ద కోడలు మీరని తెలుసు అందుకే అడిగానని చెప్తుంది. వల్లీ మెల్లగా మీరు ఇంకా మా ఆయన ఫ్రెండ్ ఏమో అనుకున్నా అనుకుంటుంది. అంజలి తను అగ్రికల్చర్ జాబ్ చేస్తున్నానని, భర్తతో విడాకులు తీసుకున్నానని చెప్తుంది.
వల్లీని కారులో ఎక్కించుకుని అంజలి డ్రాప్ చేస్తుంది. వల్లీ పుట్టింటి దగ్గర ఆగడంతో ఇక్కడేంటని అంజలి అడుగుతుంది. మా కన్నవారి ఇళ్లు పుట్టిళ్లు ఒకే ఊరు కదా, నేను ఇక్కడే ఎక్కువ ఉంటాను, అత్తారింటి కంటే పుట్టింట్లోనే ఎక్కువ ఉంటానని వల్లీ అంటుంది. నా భర్త చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, మా ఆయనకు నేను అంటే చాలా ఇష్టం, నాకు ఆయన అంటే ప్రాణం అంటూ భర్త గురించి వల్లీ చెప్పడంతో.. మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడని అర్థమైందని చెప్పి అంజలి వెళ్తుంది.
మరోవైపు భాగ్యం, భద్రావతి, సేనాపతి రౌడీలను కలుస్తారు. రౌడీలు క్షమాపణ చెప్పి వాళ్లు మామూలోళ్లు కాదు.. అందరు కలిసి మమ్మల్ని చితక్కొట్టేశారని చెప్తారు. చిల్లర వెదవల్లారా అని భాగ్యం రౌడీలను కొట్టి తిడుతుంది. భద్రావతి వదిలేయమని, ఈసారి అవకాశం వస్తే ఆ ధీరజ్ అంతు చూడండి అని చెప్పి పంపేస్తుంది. సేనాపతి, భాగ్యం ప్లాన్ నాశనం అయిపోయిందని అనుకుంటే భద్రావతి మనం సగం సక్సెస్ అయ్యాం.. రేపటి నుంచి బిజినెస్ ఎలా అవుతుందోనని టెన్షన్ పడుతూనే ఉంటాడని చెప్తుంది.
ధీరజ్ ట్రావెల్స్ కోసం అందరికి ఫోన్లు చేసి చెప్తుంటే ప్రేమ వెయిట్ చేస్తుంటుంది. పేపర్ చూసి SI పరీక్షలకు నోటిఫికేషన్ వచ్చినట్లు చూసి 20 రోజుల్లో పరీక్ష ఉందని ధీరజ్ కి చెప్తుంది. ధీరజ్ సంతోషంగా ప్రేమని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు. నా పేరు పెట్టకుండా మీ నాన్న పేరు పెట్టుకుని క్రెడిట్ కొట్టేశావని ప్రేమ అంటే మామయ్య మంచోళ్లు అంటూ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. రామరాజు మాత్రం చిన్నోడికి నేను అంటే చాలా ప్రేమ, నా పేరుతో ట్రావెల్స్ పెట్టించాడని వేదవతితో చెప్పి మురిసిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
