.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 626 లో... నర్మదకు వేదవతి విషయం చెప్పడంతో నర్మద షాక్ అవుతుంది. మీ మామయ్య, ప్రేమ వెళ్లారని వేదవతి అంటే మామయ్య వెళ్తే పని పూర్తి చేసుకుని వస్తారని నర్మద అంటుంది. తర్వాత వేదవతికి బీపీ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి, నేను ఒకరికి మాటిచ్చానని, ఆ మాట మీద నిలబడదామనుకుంటున్నానని అంటుంది. ఏంటా మాట అంటే మన వల్లీని మళ్లీ ఈ ఇంటికి తీసుకొస్తానని, ఆ బాధ్యత నాదని వల్లీకి మాటిచ్చానని చెప్తుంది. దీంతో వేదవతి రెచ్చిపోతుంది. ఇది నా ఇల్లు నువ్వు ఎవరే మాటివ్వడానికి అని వేదవతి అంటుంది. ఇది నా అత్తారిల్లు అని నర్మద అంటుంది. ఇది అత్త సామ్రాజ్యమని వేదవతి అనగా ఇది కోడల్ల రాజ్యమని నర్మద అంటూ ఇద్దరూ గొడవపడతారు. వేదవతికి తిరుపతి సపోర్ట్ చేస్తే, నర్మదకి సుకన్య సపోర్ట్ చేస్తుంది. తర్వాత వల్లీ మారిపోయిందని, ఏదో చేసుకోవడానికి వెళ్లిందని, ఒక్క అవకాశం ఇద్దామని నర్మద చెప్పడంతో వేదవతి చూద్దాంలే అంటుంది.
అటు భాగ్యాన్ని ఆనందరావు బండి మీద ఎక్కించుకుని వల్లీ కోసం వెతుకుతూ ఉంటాడు. భాగ్యం మాత్రం వల్లీ ఎక్కడికీ వెళ్లదని అంటుంది. ఇంతలో రామరాజు, ధీరజ్, ప్రేమలు కారులో వస్తూ భాగ్యం వాళ్లను చూసి కారు ఆపుతారు. భాగ్యం తన భర్తని స్పీడ్ గా వెళ్లమని చెప్పడంతో అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోతారు. ధీరజ్ వెళ్లి భాగ్యం మా నాన్న కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే కారుతో గుద్ది చంపేస్తానని బెదిరిస్తాడు. ఆనందరావు భయపడి భాగ్యానికి రామరాజు కాళ్లు పట్టుకుని సారీ చెప్పమంటాడు. భాగ్యం తప్పక రామరాజు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతుంది.
భాగ్యం వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నాతో మీ నాన్న కాళ్లు పట్టిస్తావా ధీరజ్, ఈ రోజు నుంచి నా మొదటి శత్రువు నువ్వే అని భాగ్యం మనసులో అనుకుంటుంది. ఇంటి దగ్గర వల్లీ చేతి దెబ్బకి మందు రాసుకుంటూ నర్మద మాటలు తలచుకుని సంతోషంగా ఉంటుంది. భాగ్యం, ఆనందరావు కట్లతో ఇంటికి రాగానే ఏమైందని వల్లీ అడుగుతుంది. మీ మరిది మమ్మల్ని చావు చివరి వరకు తీసుకెళ్లాడని ఆనందరావు చెప్తాడు. వాళ్లందరికీ బుద్ధి రావాలని భాగ్యం అంటే, నా విషయంలో నువ్వు రాకమ్మా నువ్వు మారిపోతే మన జీవితాలు బాగుపడతాయని వల్లీ అంటుంది. ఓ దేవత కాపాడిందని, నర్మద చెప్పిందంటే చేసి తీరుతుందని, అతి త్వరలో ఆ ఇంటికి వెళ్తానని వల్లీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
