Home

»

Tv News

Podarillu Serial: డేటింగ్‌లో మాధవ, మనీషా.. షాక్‌లో బ్రదర్స్!

Nov 22, 2026 9:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -267 లో...మనీషాతో సీక్రెట్ డేట్ కోసం మాధవ స్టైల్ గా రెడీ అవుతూ ముఖానికి పౌడర్ కూడా వేసుకుంటాడు. అతనిపై డౌట్ రావడంతో ఎక్కడికెళ్తున్నావని చక్రి అడుగుతాడు.‌ఫంక్షన్ కి అని మాధవ అబద్ధం చెప్తాడు. ఎవరిది ఏంటని వివరాలు అడిగితే నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తాడు. తను కూడా వస్తానని చక్రి అంటే తనను మాత్రమే పిలిచారని మాధవ అంటాడు. దీంతో చక్రి, కన్నాలకు అనుమానం వచ్చి అతన్ని ఫాలో కావాలని నిర్ణయించుకుంటారు.

మరోవైపు మహాలక్ష్మి బండిపై వెళ్తూ విడాకుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది..కౌన్సిలింగ్ లో చక్రి తనపై వేసుకున్న నిందలు, ఇంట్లో పెద్ది చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. ఆ పరధ్యానంలోనే రోడ్డుపై ఉన్న గుంత చూసుకోక కింద పడుతుంది. ఆమె చేతికి గాయాలవుతాయి. చుట్టుపక్కల వాళ్లు వచ్చి సాయం చేయడంతో చిన్న గాయమే కావడంతో తిరిగి బండి తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు మాధవను చక్రి, కన్నా ఫాలో అవుతూనే ఉంటారు.. అతడు కచ్చితంగా మనీషా ఇంటికే వెళ్లాడని చక్రి అంటాడు. అందుకే మాధవను దాటేసి నేరుగా ఆమె ఇంటికే వెళ్లి కాస్త దూరంగా ఆగుతారు. అన్నయ్య కచ్చితంగా ఇక్కడికే వస్తాడని చక్రి గ్యారెంటీగా చెప్తాడు.

మాధవ నేరుగా మనీషా ఇంటికి వస్తాడు.. ఇంట్లోకి వెళ్లే ముందు మరోసారి తల దువ్వుకుంటాడు.. అది చూసి చక్రి, కన్నా అబ్బో అని అంటారు. తర్వాత మనీషా డోరు తీయగానే మాధవ లోనికి వెళ్తాడు.. వీళ్లు లోపల ఏం చేస్తున్నారో చూసొస్తానని చక్రి వెళ్లి చాటుగా వాళ్ల మాటలు వింటాడు. లోపల మాధవ మనీషా ఇచ్చిన గరం మసాలా టీ ఎలా చేయాలో తెలుసుకుంటూ ఉంటాడు.. మనీషా కొత్త డ్రెస్ లో చాలా బాగుందని దిష్టి తీస్తానంటాడు.. ఇదంతా బయటి నుంచి విన్న చక్రి ఛీ అనుకుంటాడు. ఆ తర్వాత మాధవ కోసం మనీషా కొత్త డ్రెస్ తీసుకొస్తుంది.. ఇది వేసుకొని తనను బయటకు తీసుకెళ్లాలని అంటుంది. దీంతో మాధవ ఆ డ్రెస్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా తయారై బయటకు వస్తాడు.. వాళ్లను చూసి చక్రి, కన్నా షాకవుతారు..వాళ్లిద్దరిని ఫాలో అవుతూ వెళ్తారు.

మాధవ, మనీషా ఓ రెస్టారెంట్ లోకి వెళ్తారు. లోపలికి వెళ్తున్న క్రమంలో మనీషా కింద పడబోతుంటే మాధవ పట్టుకుంటాడు.. ఆ రొమాంటిక్ సీన్ ను కన్నా కన్నార్పకుండా చూస్తుంటే చక్రి మందలిస్తాడు. అటు మహా ఇంటికి రాగానే బీడీ కాలుస్తూ ఉన్న నారాయణ దానిని పడేసి అమాయకునిలా పాట పాడుతుంటాడు. మహా చేతికి అయిన గాయం గమనించి నారాయణ టీ చేసి ఇచ్చి పసుపు రాసి సపర్యలు చేస్తాడు. మరోవైపు మహాను మళ్లీ ఉడికించే ప్రయత్నాలు మొదలు పెడతాడు చక్రి.. తను ఓ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేశానని, కనకతార అనే అమ్మాయి తగిలిందని, నా మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారని అడుగుతోందని చెప్తాడు.. దానికి కారణం మీరే అని చెప్పమంటారా అని మహాతో అనడంతో ఆమె కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

[Podarillu Serial November 21st Episode, Star Maa Podarillu Today]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com