Home

»

Tv News

Illu Illalu Pillalu:  ప్రేమని నమ్మించి కార్ తీసుకెళ్లిన రౌడీలు.. నర్మద ఏం చేయనుంది!

Nov 22, 2026 8:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -637....లో ప్రేమ విపరీతంగా ఆలోచిస్తుంటే కోడి బుర్రతో ఆలోచించకు.. ఎగ్జామ్స్ పై ఫోకస్ చేయమని ధీరజ్ లెక్చర్ ఇస్తాడు. తికమక ప్రశ్నలు అడుగుతాడనుకున్న ప్రేమను ముద్దు అడగడంతో సీన్ రొమాంటిక్ గా మారుతుంది. అప్పుడే సుకన్యను తిరుపతి తరుముతూ వస్తాడు. నాన్న చూస్తే పులిరాజు పిల్లిరాజు అవుతావని ధీరజ్ అనడంతో సుకన్య తప్పించుకుంటుంది.

మరోవైపు రోజూ 10 సార్లు ఫోన్ చేసే విశ్వ చేయట్లేదని అమూల్య ఆలోచించి తనే కాల్ చేస్తుంది.. దాంతో విశ్వ తెగ సంబరపడిపోతాడు. మా తాతకు సీరియస్ గా ఉందని ఊరికి వచ్చామని విశ్వ అంటాడు. అంజలి మాటలతో చందు సంతోషంగా ఉండగా, వల్లి బాధతో చందుకి కాల్ చేస్తే బిజీ వస్తుంది. తర్వాత నర్మదకు కాల్ చేస్తే అది చూసిన సాగర్ ఫోన్ పగలగొడతాడు. నా ఉద్యోగం పీకించావుగా.. హై లెవెల్ జాబ్ ఈజీ కాదని నర్మదను చులకనగా మాట్లాడతాడు. నువ్వు చీప్ గా ప్రవర్తిస్తున్నావని నర్మద గొడవపడుతుంది.

ఇంతలో కస్టమర్ వచ్చి 5 వేలు ఇచ్చి కారు తీసుకెళ్తాడు.. ఇలా రోజుకు నాలుగైదు బేరాలు వస్తే అప్పు నుంచి గట్టెక్కొచ్చని ప్రేమ అంటుంది. అప్పుడే గొడవ పెట్టుకున్న రౌడీలు నామాలు పెట్టుకుని బుద్ధిమంతుల్లా వచ్చి పండగకి ఊరు వెళ్లాలని కార్లు రెంట్ కి అడుగుతారు.. కాంప్రమైజ్ అంటూ చెల్లెమ్మా అని ప్రేమను నమ్మిస్తారు. ధీరజ్ వద్దన్నా వినకుండా ప్రేమ 10 వేలు అడ్వాన్స్ తీసుకుని కారు కీస్ ఇచ్చేస్తుంది. కారు తీసుకెళ్లిన రౌడీలు దాన్ని అర్జెంట్ గా అమ్మేయండి, పార్టులుగా అమ్మేయండని ప్లాన్ వేస్తారు. చివర్లో వల్లి దగ్గరికి నర్మద వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Illu Illalu Pillalu Serial November 21st Episode, Star Maa Illu Illalu Pillalu

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com