Home

»

Tv News

Ye Devi Varamo Neevu:మురిసిపోయిన అంజలి.. భవిత హ్యాపీ!

Nov 22, 2026 9:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -122 లో అంజలికి మనీష్ చీర తీసుకొని వస్తాడు. అది చూసి అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడే ఇవ్వొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చావని అంజలి అడుగుతుంది. నువ్వు స్పెషల్ కదా అని మనీష్ అనగానే అంజలి ఇంకా మురిసిపోతుంది. అంజలికి మనీష్ వంటల్లో హెల్ప్ చేస్తాడు.. అంజలి వేరుశెనగ గింజని గ్లాస్ లో వేస్తుంది. అది అందులో పడగానే అంజలి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.

మరోవైపు భవిత దగ్గరికి కమల వస్తుంది.. ఏం చేస్తున్నావ్ కోడలు పిల్లా అని కమల అనగానే ఏంటి అత్తయ్య అలా అంటున్నావని భవిత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నా కోడలివి కదా.. ఈ విషయం ఇప్పుడే మీ మావయ్యకి చెప్పాను.. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని కమల అనగానే ఎందుకు అవ్వడు.. అప్పులు క్లియర్ అవుతుంటే అని భవిత మనసులో అనుకుంటుంది. మీ పెళ్లి గురించి మనీష్ తో మాట్లాడుతానని కమల అనగానే వద్దు అత్తయ్య, మా మమ్మీ ఏం చెప్తే అదే మనీష్ చేస్తాడని భవిత అంటుంది.

మరోవైపు గీతకి అంజలి పాలు తీసుకొని వస్తుంది, ఇప్పుడు తాగాల్సింది నేను కాదు నువ్వు అని, నువ్వు పొద్దున్న నుంచి పనులు చేసి అలసిపోయావని గీత అంటుంది. ఆ పాలు తీసుకొని అంజలి మురిసిపోతుంది. తరువాయి భాగంలో రోహిత్ దగ్గరికి గీత వెళ్లి రాకీని తీసుకొని రమ్మని చెప్తుంది.. రోహిత్ వెళ్తుంటే అంజలి ఆపుతుంది.. వాడు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని అంటుంది. కానీ రాకీని శంకర్ ఇంటికి తీసుకొని వస్తాడు.. కమల హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది‌. అది చూసి అంజలి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

[Ye Devi Varamo Neevu Serial November 22 Episode, Star Maa Ye Devi Varamo Neevu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com