Home

»

Tv News

Podarillu: చక్రిపై విరుచుకుపడ్డ కేశవ.. అసలు నిజం బయటపెట్టిన మహా!

Mar 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -76 లో... చక్రి, మహా విడాకులు తీసుకుంటున్న విషయం కేశవకి తెలుస్తుంది. దాంతో ఇంట్లో అందరి ముందు చక్రిని నిలదీస్తాడు కేశవ. ఇందులో చక్రి తప్పేం లేదు.. నాకే విడాకులు కావాలని అంటున్నానని మహా అంటుంది. ఎందుకురా తనకి ఆ ఆలోచన వచ్చేలా చేసావ్.. ఏం తప్పు చేసావ్.. అన్నీ అబద్ధాలు చెప్పి తన మనసు ముక్కలు చేశావా అని చక్రిపై కేశవ కోప్పడతాడు. ఎందుకు వదిన ఇక్కడ నీకు నచ్చలేదా అని కన్నా అంటాడు. 

ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పటం లేదని మహా అంటుంది. నేను చక్రిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి మాత్రమే చక్రిని పెళ్ళి చేసుకున్నానని మహా అనగానే అందరు షాక్ అవుతారు. అవును ఈ విషయం నాకు రిసెప్షన్ రోజే తెలిసింది. మన ఇంటిపరువు కోసం ఆ రోజు రిసెప్షన్ చేసుకుందని మాధవ చెప్తాడు. ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్పావని చక్రిని కేశవ అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏం నష్టం జరిగింది.. మన కుటుంబం కోసమే కదా అని చెప్పేసి చక్రి వెళ్లిపోతాడు. అదంతా నారాయణ విని బాధపడతాడు. 

ఆ తర్వాత మాధవ దగ్గరికి కేశవ వచ్చి.. సారీ అన్నయ్య వాళ్ళు కలిసుంటే చూడలేవా అంటూ చాలా మాటలు అన్నానని తన కాళ్ళపై పడతాడు. అదంతా మహా చూస్తుంది. మరొకవైపు కన్నా బాధపడుతుంటే మహా చూసి బాధపడుతుంది. అనవసరంగా నిజం చెప్పి వీళ్ళని బాధపెట్టానా అని మహా అనుకుటుంది.

ఆ తర్వాత మహాకి వాళ్ళ వదిన ఫోన్ చేసి.. నా ఫ్రెండ్ బాచిలర్ ఉంది.. తన రూమ్ లో ఉండు.. ఆ అయిదుగురు మగాళ్ల మధ్యలో ఎలా ఉంటున్నావో ఏమో.. త్వరగా అక్కడ నుండి వచ్చేయమని హారిక అంటుంది. మగాళ్లు అంటే మనుషులు కాదా.. మీ ఇంట్లో వాళ్ళ కంటే వీళ్ళు చాలా బెటర్.. వీళ్ళంతా నాతో బాగుంటారు.. నన్ను అర్థం చేసుకుంటారు.. ఇంకొకసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకు అని హారికతో మహా అనేసి ఫోన్ కట్ చేస్తుంది. 

ఆ తర్వాత చక్రి ఇంటికి వస్తాడు. బాధగా కూర్చుంటాడు. తన చుట్టూ అన్నతమ్ముళ్లు కూర్చొని ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com