Home

»

Tv News

Sri Satya: ఆ బ్లాక్‌బస్టర్ మూవీలో నటించా.. కానీ ఎడిటింగ్ లో మొత్తం పోయింది!

Mar 24, 2026

శ్రీసత్య బుల్లితెర మీద కంటే మూవీస్ లో నటించాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. ఐతే చాలామంది చిన్నపిల్ల ఫేస్ అంటూ అవకాశాలు ఇవ్వడం లేదు అని చెప్తోంది. ఐతే ఒక మూవీ విషయంలో తనకు చాల విషయాలు తెలిశాయంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. 

"నేనసలు యాక్టింగ్ లోకి వద్దామని అనుకోలేదు. నాకు నటించడం తెలీదు. రాంప్ మీద నడవమంటే చాలా ఇష్టం. సరే బ్రేకప్ అయ్యాక ఒక ఆఫర్ వచ్చింది అని చేశా. ఏదయినా చివరికి అందరికీ సినిమా అంటేనే ఇష్టం ఉంటుంది. నేను చేసిన ఒక మూవీ మొత్తం ఎడిటింగ్ లో పోయింది. అదే టిల్లు 2 . 

అది చాలా మంచి రోల్. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. కానీ అలా జరిగిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని అప్పుడే  తెలిసింది. అప్పుడు అనిపించింది ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అని . డబ్బింగ్ ఐపోయింది అంతా ఐపోయింది కానీ వాళ్లకు చివరికి సినిమా బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది ఏమీ లేదు. నేను ఆ మూవీ కోసం చాలా రోజులు పని చేసాను. నేను ఈ మూవీ విషయంలో చాలా నేర్చుకున్నా. మనమేం చేస్తున్నామో ఎవరికీ ముందుగా చెప్పకూడదు. కానీ నాకు తెలీదుగా అందరికీ చెప్పేసుకున్నా. అసలు అలా చెప్పుకోకూడదు. చూసాక వాళ్ళే మనకు చెప్పాలి. 

మీకు ప్రేమ ఉంటె మనసులో దాచుకోండి కానీ టాటూ వేయించుకోకండి బ్రేకప్ ఐపోతుంది. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి రామ్ లా అందంగా ఉండాలి. మా నాన్న నాకు చెప్పేసారు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి మా పేరెంట్స్ ని కూడా బాగా చూసుకోవాలి " అని చెప్పింది సత్య.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com