
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -625 లో... వల్లిని ఇంటికి తీసుకురావడంలో తప్పు లేదు.. అలా అని ఇప్పుడే తీసుకురాను.. విడాకులకు కూడా ఒప్పుకోనని రామరాజు అంటాడు. వల్లి పెద్దగా చదువుకోలేదు.. తల్లి చెప్పినట్లు వింది, పెద్దోడు ఆవేశంలో విడాకులు పంపాడు కానీ మనం ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదని చెప్తాడు. మనం కొత్తలో ఎన్నిసార్లు గొడవపడలేదు, వల్లితో ఇన్ని రోజులు కాపురం చేశాడంటే ప్రేమ ఉండే ఉంటుంది.. వాడి కోపం బయటకు రానివ్వట్లేదని రామరాజు అంటాడు. మీరు మాటలతో మనసులు మార్చేస్తారని వేదవతి అంటుంది.
పెద్దోడు ఎవరి మాట వింటాడంటే ధీరజ్ మాట వింటాడని ప్రేమ చెప్తుంది. చిన్నోడు ఫైనాన్స్ కోసం వెళ్లాడని చెప్పగానే విశ్వ వచ్చి ఆ ఫైనాన్స్ గురించే మాట్లాడదామని వచ్చానని అంటాడు. ధీరజ్ ఫోన్ మర్చిపోయాడని ప్రేమ చెప్తే విశ్వ అసలు కుట్ర బయటపెడతాడు. ఆ చింతామణి, భద్రావతి అత్తయ్య మనిషి.. చింతామణితో ధీరజ్‌ను ట్రాప్ చేస్తుందని వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్తాడు. చిన్నోడు సంతకం పెడితే భద్రావతి వదిలిపెట్టదని రామరాజు అంటాడు.
మరోవైపు ధీరజ్ దగ్గరికి చింతామణి, భద్రావతి వెళ్తారు. భద్రావతి కారులో ఉండి ఇది 30 లక్షల డబ్బు కాదు ఎన్నో ఏళ్ల పగ, వాడు పాలేరు కావాలని అంటుంది. కాసేపట్లో మన పనోడు అవుతాడని చింతామణి వెళ్లి ధీరజ్‌తో మాట్లాడుతుంది. బ్యాంక్ వాళ్లకు 30 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ ఇస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ అంతా తన అండర్లో ఉంటుందని ఉందని ధీరజ్ అడుగుతాడు. 30 లక్షలు మాటలు కాదు.. రేపు నువ్వు ఇవ్వకుంటే నేనేమైపోవాలని, అందికే ఈ అగ్రిమెంట్ అని చింతామణి నమ్మిస్తుంది..సంతకం పెట్టమంటుంది.
సంతకం పెడుతుండగా రామరాజు, ప్రేమ వచ్చి ఆపుతారు. చింతామణి, భద్రావతి షాక్ అవుతారు. నాశనం చేస్తుందని ప్రేమను తిట్టుకుంటుంది భద్రావతి. ఆ అగ్రిమెంట్‌ను రామరాజు, ప్రేమ చింపేసి చింతామణి మొహంపై విసిరేస్తుంది ప్రేమ. భద్రావతితో చేతులు కలిపిందా అని రామరాజు అంటే సంతకం పెడితే కొంప కొల్లేరు అయ్యేదని ప్రేమ అంటుంది. ఓ భద్రావతి ఏడుండావమ్మా నీ ప్లాన్ పాడైందంటూ ధీరజ్ పిలిస్తే భద్రావతి వస్తుంది. 30 లక్షలు తీసుకుని సంతకం పెట్టు లేకుంటే 5 లక్షలు ఫైన్ అని బెదిరిస్తుంది. అంత ఆనందపడకు అంటూ రామరాజు చప్పట్లు కొట్టగానే ఒకతను డబ్బు తెస్తాడు. బ్యాంక్ వాళ్లకు 30 లక్షలు ఇచ్చి ట్రావెల్ ఏజెన్సీ తాళాలు(కీ) తీసుకుని ధీరజ్‌కు ఇస్తాడు.. నా కుటుంబం ఉన్నంతకాలం ఏం చేయలేవని భద్రావతిని అవమానించి రేపు ప్రారంభోత్సవానికి రమ్మంటాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu Episode 625, Illu Illalu Pillalu November 7th episode, Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu Latest Episode, Illu Illalu Pillalu Serial, Star Maa serial, Telugu TV News]






