Home

»

Tv News

Podarillu: కిడ్నాపర్స్ కి చుక్కలు చూపించిన చక్రి.. మాధవ ఎంట్రీతో ప్రతాప్ గుట్టు రట్టు!

Jun 4, 2026 11:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో... చక్రి దగ్గరికి మంకీ క్యాప్ లో ఆది వెళ్తాడు. మరొకవైపు చక్రి కోసం మాధవ వాళ్ళు టెన్షన్ పడతారు. ఎలాగైనా చక్రి ఎక్కడున్నాడో కనిపెట్టాలని ముగ్గురు బయల్దేరతారు. ఏంట్రా బామ్మర్ది ఇదంతా నీ ప్లానేనా అని చక్రి అంటాడు. ఆది కోపంగా చక్రిని కొడతాడు.. దమ్ముంటే మాస్క్ తీసి కొట్టరా అని చక్రి అనగానే ఆది బయటకు వెళ్తాడు. వాడు గుర్తుపట్టాడా అని ప్రతాప్ అడుగుతాడు. గుర్తుపట్టినట్లు మాట్లాడాడు కానీ కన్ఫర్మ్ గా తెలియదు. 

మరొకవైపు శైలు వేరే ఫోన్ నుంచి కేశవకి చేస్తుంది. ఒకవేళ చక్రి చేసాడేమోనని కేశవ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. శైలు మాట్లాడగానే తనపై మళ్ళీ కోప్పడతాడు కేశవ.

ఆ తర్వాత ప్రతాప్, ఆది ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. చక్రి గురించి ఏమైనా తెలిసిందా అని మహా అడుగుతుంది. వాడు డబ్బు నగలు పట్టుకొని పారిపోయాడు.‌ వాడు ఎలాంటి వాడో అర్థం అయింది.‌ ఇక వాడిని మర్చిపో.. ఆ భూషణ్ కెనడా వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నాడు.. అతన్ని పెళ్లి చేసుకోమని ప్రతాప్ అంటాడు. దాంతో మహా కోపంగా వెళ్తుంది. 

ఆ తర్వాత రౌడీలలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. మీరు హెయిర్ లీవ్ చేసి ఆద్దంలో చూసుకోండి బాగుంటారని చక్రి ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి మురిసిపోతుంది. తన ఫోన్ పక్కన వదిలేసి అద్దంలో చూసుకోవడానికి వెళ్తుంది. అక్కడున్న ఫోన్ కిందపడేసి కాలితో కేశవకు కాల్ చేస్తాడు. నన్ను కిడ్నాప్ చేశారని చక్రి వాళ్లకు చెప్తాడు. ఏదో గోడౌన్ అని చక్రి ఫోన్ పక్కకి అంటాడు. అప్పుడే రౌడీలు వచ్చి ఎవరికి ఫోన్ చేసావని కోప్పడతారు. మళ్ళీ రివర్స్ చేస్తే మాధవ లిఫ్ట్ చేసి హలో అనగానే రౌడీలు కట్ చేస్తారు. 

చక్రి ఎవరికో ఫోన్ చేశాడని రౌడీలు ఆదికి చెప్తారు. దాంతో వేరొక ప్లేస్ కి మార్చండి అని ఆది చెప్తాడు. చక్రిని వేరొక ప్లేస్ కి తీసుకొని వెళ్తుంటే.. కేశవ వాళ్ళ బైక్ కి డాష్ ఇస్తారు. కార్ డ్రైవర్ కేశవతో మాట్లాడి వెళ్తుంటే వెనకాలున్న చక్రిని కన్నా చూసి మాధవ వాళ్ళకి చెప్తాడు. దాంతో మాధవ వాళ్ళు కార్ ని ఫాలో చేసి రౌడీలని కొట్టి చక్రిని కాపాడతారు. 

తరువాయి భాగంలో ప్రతాప్ ఇంటికి చక్రి వెళ్తాడు. చక్రిని చూసి ప్రతాప్, ఆది, లలిత షాక్ అవుతారు. డబ్బు బంగారం ఎక్కడ అని చక్రిని ప్రతాప్ అడుగుతాడు. అప్పుడే మాధవ ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని నమ్మి నా తమ్ముడిని పంపించాను.. ఇలా చంపే ప్రయత్నం చేస్తారనుకోలేదు అని అనగానే మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com