Home

»

Tv News

Jayam serial: గంగ బాక్సింగ్ మ్యాచ్.. ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్ ఎంట్రీ!

Jun 4, 2026 12:03PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో.. గంగ బాక్సింగ్ పోటీకి సంబంధించిన లైవ్ వస్తుందోనని సుధా టీవీలో చూస్తుంది. ఎన్ని ఛానల్స్ చూసినా రాదు.. దాంతో లక్ష్మి దగ్గరికి సుధా వెళ్తుంది.. అసలు నువ్వు గంగ కన్నతల్లివేనా అని సుధా అడుగుతుంది. దాంతో లక్ష్మీ టెన్షన్ పడుతుంది... మరేంటి కన్న కూతురు అక్కడ బాక్సింగ్ పోటీకి వెళ్తుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నావేంటని లక్ష్మీని సుధా కోప్పడుతుంది. మనం వెళ్లి అక్కడ పోటీ ఎలా జరుగుతుందో చూద్దామని లక్ష్మితో సుధా అంటుంది. 

మరొకవైపు బాక్సింగ్ పోటీకి సంబంధించిన హడావిడి మొదలవుతుంది. రుద్ర, గంగ, రంగా అక్కడికి చేరుకుంటారు. నువ్వు పోటీ పడేది తనతోనే.. తన పేరు రీతూ సింగ్ అని రుద్ర తనని చూపిస్తాడు. రీతూని చూసి గంగ భయపడుతుంది. నేను తనతో పోటీ చెయ్యాలా అని గంగ అనుకుంటుంది. నువ్వు టెన్షన్ పడొద్దు.. బావ పేరు నిలబెట్టాలని రంగా అంటాడు. 

మరొకవైపు పెద్దసారు పోటీ జరిగే దగ్గరికి వెళ్లాలని అటు ఇటు తిరుగుతాడు. అప్పుడే శకుంతల వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. ఫ్రెండ్ దగ్గరికి అని పెద్దసారు అంటాడు. మీరు అబద్దం చెప్తున్నారు.. గంగ పోటీ దగ్గరికి కదా అని శకుంతల అనగానే అవునని పెద్దసారు అంటాడు. మీరు అక్కడ పోటీ చూసి టెన్షన్ పడతారు.. వద్దని శకుంతల అనగానే సరే సూపర్ మార్కెట్ కి వెళ్తానని పెద్దసారు చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. అసలు అందరు గంగకి ట్యాలెంట్ ఉందని అంటున్నారు. ఒకసారి ఆ ట్యాలెంట్ చూద్దామని శకుంతల కూడా అనుకొని ఎవరికీ చెప్పకుండా పోటీ దగ్గరికి వెళ్తుంది.

ఆ తర్వాత రుద్రకి గంగ ధైర్యం చెప్తాడు. మరొకవైపు లక్ష్మి, సుధా పోటీ దగ్గరికి వస్తారు. వాళ్ళతో రంగా మాట్లాడతాడు. ఆ తర్వాత పెద్దసారు పోటీకి వస్తాడు. ఎవరికి తెలియకుండా శకుంతల వస్తుంది. ఇషిక, వీరు కూడా వస్తారు. శకుంతల, పెద్దసారు రావడం ఇషిక, వీరు చూసి వీళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చారన్నమాట అని అనుకుంటారు. గంగ, రీతూ సింగ్ ని పోటీకి పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com