
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో.. ఆనందరావుని మిల్ కి పంపించాలని వల్లి, సుకన్య అనుకొని చందు రాగానే మా నాన్నకి వడదెబ్బ తగిలిందని అంటారు. మనుషులు అన్నాక తప్పు చెయ్యడం సహజం కదా.. అది మర్చిపోయి మా నాన్నని మిల్ కి తీసుకొని వెళ్ళండి అని చందుని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది.
అప్పుడే ధీరజ్ ఇడ్లీ తీసుకొని వచ్చి.. వదిన మీరు ముందు ఈ టిఫిన్ చెయ్యండి అని ఇస్తాడు. వల్లి ఆ టిఫిన్ చేస్తూ ఇదేంటి మా నాన్న చేసిన ఇడ్లీలాగా ఉందని వల్లి అంటుంది. మీ నాన్న చేసిన ఇడ్లీనే అని ధీరజ్ చెప్తాడు. అదేంటి మీ నాన్నకి వడదెబ్బ తాకింది అన్నావని చందు అంటాడు. నీకు ఇంకా అర్థం కాలేదా.. వాళ్ళ నాన్నని మిల్ కి పంపించాలని ప్లాన్ చేసిందని ధీరజ్ అనగానే.. నేను అది నమ్మి నిజంగానే మిల్ కీ తీసుకొని వెళ్ళాలనుకున్నా.. ఛీ నువ్వు అసలు మారవని వల్లిపై చందు సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఇదంతా నీ వల్లే అని సుకన్యపై వల్లి కోప్పడుతుంది.
ఆ తర్వాత నర్మద కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తుంది. తను ఉప్మా చేస్తే అంతా మాడిపోతుంది. అది వేదవతి చూసి ఏంటే కిచెన్ ని మొత్తం పొగ చేసావని అడుగుతుంది. అప్పుడే సాగర్ సరుకులు తీసుకొని వస్తాడు. ఏంట్రా అన్ని తీసుకొని వచ్చావని ధీరజ్ అంటాడు. నిన్న ఏదో అన్నారు కదా.. దానికి సమాధానంగా రెండు నెలల సరుకులు తీసుకొని వచ్చానని సాగర్ చెప్తాడు.
ఇక సాగర్ కోసం ఉప్మా చేసానని నర్మద అంటూ సాగర్ కి ఇస్తుంది. అది చూసి ఏంటి ఇలా ఉందని సాగర్ అడుగుతాడు. లైట్ గా మాడిపోయిందని నర్మద చెప్తుంది. ప్రేమ మన ఉప్మా తీసుకొని రా అని ధీరజ్ అనగానే ప్రేమ ఉప్మా తీసుకొని వచ్చి ధీరజ్ కి ఇస్తుంది. అది తీసుకొని సాగర్ ని ఊరిస్తూ ధీరజ్ తింటాడు. ఒరేయ్ నేను తీసుకొని వస్తానని సాగర్ తో వేదవతి అనగానే అత్తయ్య ఆగండి.. మేం ఇప్పుడు వేరుపడ్డాం.. మీరు ఇస్తే తినడానికి సిగ్గు లేదా అని నర్మద అంటుంది. దాంతో సాగర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ వెళ్తుంటే.. అది భద్రవతి చూసి రౌడీకి ఫోన్ చేసి ఆ ధీరజ్ గాడు ఇంట్లో నుంచి బయల్దేరాడని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






