Home

»

Tv News

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో పవిత్ర ఎమోషనల్.. అమ్మకు ఇచ్చిన మాట ఏంటంటే.!

Nov 9, 2026 5:29PM

వంటస్టిక్  దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో పాగల్  పవిత్ర సందడి చేసింది . తన కెరీర్, పర్సనల్ లైఫ్ , ఫ్యూచర్  గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో తన తల్లి గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆమె కొంచెం ఎమోషనల్ అయ్యింది . తన తల్లి తన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలనేది తన కోరిక అని చెప్పింది . అంతేకాదు, తన తల్లికి ఇచ్చిన మాటను కూడా షేర్ చేసుకుంది.

పవిత్ర గురించి తనకు ఆరేళ్లుగా తెలుసని చెప్పాడు హోస్ట్ టేస్టీ తేజ.  తెరపై అందరినీ నవ్వించే ఆమె లైఫ్ లో  ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయన్నారు . ముఖ్యంగా తన తల్లిని పవిత్ర ఎంత బాగా చూసుకుంటారో తనకు తెలుసని చెప్పాడు . ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తాను సంపాదించిన డబ్బుతో సొంత ఊరిలో  పవిత్ర వాళ్ళ అమ్మ   కోసం ఇల్లు కట్టించి అక్కడే పెట్టిందని చెప్పాడట.   అమ్మ రోజుకు దాదాపు 100సార్లు ఫోన్ చేస్తుందని సరదాగా చెప్పారు. ఫోన్ ఎత్తకపోతే మళ్లీ మళ్లీ కాల్ చేస్తుందని, అందుకే ఆమెకు పెద్ద ఫోన్ కొనివ్వలేదని నవ్వుతూ ఫన్నీగా చెప్పింది . ఒకవేళ వీడియో కాల్ చేస్తే తాను ఎక్కడున్నానో తెలిసిపోతుందని కామెడీగా కామెంట్ చేసింది.

అయితే తన తల్లి విషయంలో పవిత్రకు ఒక ఆలోచన ఉందని తన  తల్లి తన దగ్గరకు వచ్చి ఉండాలని ఆరేళ్లుగా అడుగుతున్నా రావడం లేదని బాధపడింది .  ఉన్న ఒళ్ళో  ఒక చిన్న స్కూల్‌లో ఉద్యోగం చేసుకుంటూ, తనకు నచ్చినట్లుగా అక్కడే ఉంటోందని చెప్పింది . తన దగ్గరకు వస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అందుకే ఇక్కడికి రావట్లేదని చెప్పుకొచ్చింది .  

తనకు  ఎవరూ సిబ్లింగ్స్ లేరు కాబట్టి తల్లి ప్రేమ మొత్తం తనకే దక్కుతుందని పవిత్ర చెప్పింది. తన తల్లి తనను ఎప్పుడూ జడ్జ్ చేయకుండా అర్థం చేసుకుంటుందని, తాను చెప్పేది వింటూ ప్రేమగా చూసుకుంటుందని , తనలాంటి కూతురికి ఇంత ప్రేమను పంచే తల్లి ఉండటం అదృష్టమని  చెప్తూ  “మమ్మీ.. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తావో నాకు తెలుసు. నేను కూడా నీ గురించే ఆలోచిస్తుంటాను. మనం త్వరలోనే పూర్తిగా సక్సెస్ అవుతాం” అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది.

తన తల్లి చిన్నతనంలో ఎన్నో కష్టాలు, బాధలు పడిందని  పవిత్ర గుర్తు చేసుకున్నారు. కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి అనుభవించిన బాధలు మళ్లీ ఎప్పుడూ ఆమె జీవితంలోకి రాకూడదని ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాననంది.
ఇక తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో చెప్పింది. అతను చాలా  క్యూట్‌గా ఉండాలని, తనను బాగా చూసుకోవాలని, ప్రేమగా పాంపర్ చేయాలని  కోరుకుంది.  తనకు కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడి తనను కూల్ చేసే వ్యక్తి ఉంటే బాగుండు అనుకుంది. ఇక కెరీర్ గురించి చెప్తూ  ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నానని, వాటిలో ఒక సినిమాలో లేడీ కమెడియన్‌గా కనిపించబోతున్నానని చెప్పుకొచ్చింది  వీటితో పాటు ఒక గేమ్ షో చేస్తున్నానని, ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు చెప్పింది.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com