
గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోయిన్ రక్షా గౌడా కన్నా జగతి మేడం ఫుల్ ఫేమస్ అయ్యింది. ఐతే మధ్యలోకి వచ్చేసరికి తన రోల్ మరీ డల్ ఐపోవడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకుని మూవీస్ లో నటించడానికి వచ్చేసింది. ఇక రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. జగతి మేడం చాలా బాషాలు వచ్చన్న విషయాన్ని చెప్పారు. " మాతృబాష తుళు. నేను పుట్టింది పెరిగింది కూర్గ్ . కూర్గి అక్కడ ఇంకో భాష ఉంటది గౌడ భాష అది కొంచెం కొంచెం వచ్చు ఎక్కువ మాట్లాడను. కూర్గి లేకపోతే కన్నడ లేకపోతే ఇదే తుళు సో ఈ మూడు భాషలు పుట్టుకతోనే వచ్చాయి . దాంతో పాటు ఆ తెలుగు నేర్చుకున్నాను. దాని తర్వాత తమిళ్ కి వెళ్ళాను అక్కడ తమిళ్ నేర్చుకున్నాను. మలయాళం తెలుసు అంటే కూర్గ్ లో ఎక్కువ మళయాలీస్ ఉన్నారు. సో అందువల్ల విని విని అప్పట్లో కొంచెం మాట్లాడే దాన్ని. ఇప్పుడు కొంచెం ఆ టచ్ పోయింది. మళ్ళీ ఒక సినిమా చేయాలని ఆఫర్ వచ్చింది. అక్కడ కొన్ని ట్రైనింగ్ అదీ జరిగింది. సో అప్పుడు కొంచెం అంటే ఫెమిలియర్ నాకు తెలుసు నేను మాట్లాడొచ్చు అనిపిస్తాది.ఒక నెల రోజులు అక్కడ ఉంటే నేను నేర్చేసుకుంటా." అని చెప్పింది. ఇక సీరియల్ లో తన రోల్ గురించి కూడా మాట్లాడింది.
"గుప్పెడంత మనసు కూడా ఏమైందంటే స్టార్టింగ్ లో జగతిని చాలా చాలా స్ట్రాంగ్ అన్నట్టు చూపించారు. ఇంకొకరికి రోల్ మోడల్ లా ఉండే క్యారెక్టర్ అది. ప్రతీ సారి హీరో హీరోయిన్స్ నే చూపించలేరు కదా. వాళ్ళు కూడా రైజింగ్ స్టార్స్ కదా . అంత స్ట్రాంగ్ గ చూపించిన రోల్ ని సడెన్ గా ఫ్యామిలీలో వంట చేసుకునే రోల్ లోకి మార్చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఈ రోల్ అసలు సెట్ అవ్వదు అనిపించింది." అని చెప్పింది జగతి మేడం. ఇక ఆమె తన వెయిట్ గురించి చెప్తూ జిమ్ కి వెళ్లేముందు 66 కేజీలు ఉన్నాను ఆ తరువాత ఒక్కసారిగా ఆరు కేజీలు తగ్గిపోయాను. ఫస్ట్ వెయిట్ లాస్ ఎప్పుడూ త్వరగా తగ్గిపోతుంది. నెలా రెండు నెలల్లో నేను చాలా తగ్గిపోయాను." అని చెప్పింది జ్యోతి పూర్వాజ్.
-----------




.webp)

