Home

»

Tv News

బిగ్ బాస్ కౌశల్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు T

Nov 9, 2026 5:33PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మందకు  అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో  గుర్తింపు పొందిన ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ అందాల పోటీలకు భారతదేశం, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా ఆయన ఎంపికయ్యారు. దాదాపు 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ పోటీల్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత కౌశల్‌కు దక్కింది. దీంతో ఆయనకు చాలామంది విషెస్ చెప్తున్నారు . కౌశల్‌కు మోడలింగ్, ఫ్యాషన్, నటన లాంటి రంగాల్లో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు వేలాది మోడలింగ్ షూట్స్‌లో పాల్గొనడంతో పాటు, 3,000 మందికి పైగా మోడల్స్‌కు ట్రైనింగ్  ఇచ్చారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, అందాల పోటీల్లో భాగమయ్యారు. ఈ అనుభవంతోనే ఆయనకు రెండు దేశాల నేషనల్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.

ఈ బాధ్యతలు చేపట్టిన కౌశల్.. భారత్, అమెరికా తరఫున అంతర్జాతీయ పోటీల్లో కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ని  ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా వచ్చిన కంటెస్టెంట్స్  వివరాలను పరిశీలించి, పలు దశల్లో స్క్రూటినీ చేసి  ముగ్గురిని ఎంపిక చేశారు. భారతదేశం తరఫున మిస్టర్ ప్లానెట్ పోటీలకు 19 ఏళ్ల ఈషాన్ యెల్డే ఎంపికయ్యారు. ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉన్న ఈషాన్ రీసెంట్ గా  జరిగిన మిస్టర్ టీన్స్ సౌత్ ఇండియా పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఆయన ఫిట్‌నెస్, వ్యక్తిత్వం, మోడలింగ్ టాలెంట్ ని  పరిశీలించిన కౌశల్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు.

అలాగే హైదరాబాద్‌కు చెందిన మెడికల్ విద్యార్థిని అశ్రిత నీలకంఠం మిస్ ప్లానెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన మిస్ టీన్స్ సౌత్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన అశ్రిత.. తన ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం, ఎలాంటి ప్రశ్నకైనా తెలివిగా సమాధానం చెప్పే నైపుణ్యాన్ని ప్రదర్శించి  జడ్జెస్ ని  ఆకట్టుకున్నారు. అమెరికా తరఫున మిస్ ప్లానెట్ పోటీల్లో పాల్గొనేందుకు తన్వి పడాలను ఎంపిక చేశారు. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్న తన్వి మెడికల్ విద్యార్థిని. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి కౌశల్ వద్ద తీసుకున్నారు .  రెండు నెలలుగా ఆమెకు అంతర్జాతీయ పోటీలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించారు.
ఈ ముగ్గురు అభ్యర్థులను అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేసేందుకు కౌశల్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ స్ట్రెంత్, ర్యాంప్ వాక్, స్టేజ్ ప్రెజెన్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. పోటీల్లో న్యాయనిర్ణేతలను ఎలా ఎదుర్కోవాలి? వేదికపై ఎలా మాట్లాడాలి? ఇలాంటి అన్ని విషయాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

జార్జియాలోని టిబిలిసి నగరంలో నవంబర్ 11 నుంచి 16 వరకు ఈ మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్ అంతర్జాతీయ పోటీలు జరగబోతున్నాయి . ఇందులో భారత్ తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం, అమెరికా తరఫున తన్వి పడాల పోటీపడనున్నారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న మోడల్స్ ఉన్నారని, వారికి సరైన గుర్తింపు, శిక్షణ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. రెండు నెలలుగా ముగ్గురు అభ్యర్థులను అన్ని విధాలుగా సిద్ధం చేశామని, వారు తమ దేశాలకు కిరీటాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మొత్తానికి బిగ్ బాస్ విజేతగా తెలుగు ఆడియన్స్ లో  గుర్తింపు తెచ్చుకున్న కౌశల్   ఇప్పుడు అంతర్జాతీయ అందాల పోటీల్లో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆయన శిక్షణలో సిద్ధమైన ముగ్గురు యువ మోడల్స్ ఇప్పుడు ప్రపంచ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com