ఢీ అంటే ఏంటనుకున్నావ్...జానుకి పండు వార్నింగ్
on Oct 11, 2025
.webp)
ఢీ - 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇది కంప్లీట్ గా స్టూడెంట్స్ స్పెషల్ గా రాబోతోంది. అందరూ కూడా స్కూల్ యూనిఫామ్ లో వచ్చారు. జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ ఇంగ్లీష్ మాష్టర్ అంటూ నందు పరిచయం చేసాడు. "నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూడనిదే " అంటూ ఆది ఏదో చెప్పబోయి ఆపేసాడు. ఇక పక్కనే దీపికా స్కూల్ యూనిఫామ్ లో వచ్చి "మా ఫిజిక్స్ మాష్టర్ వచ్చి నాకు అబద్దం చెప్పారు. మనుషులు భూమి మీద జీవిచగలరు అని అన్నారు. కానీ మీరు నా మనసులో కూడా జీవిస్తున్నారు" అనేసరికి నందు, ఆది కలిసి ఆట పట్టించారు "వరదా" అంటూ ఆది డస్టర్ తీసుకుని నా బుర్ర బద్దలుకొట్టేసుకుంటాను" అన్నాడు. ఇక రెజీనా ఇంగ్లీష్ టీచర్ గా వచ్చింది. "టెన్సెస్ గురించి తెలుసా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్" అంది. "రాజు కప్పు కొట్టాడు..అది పాస్ట్ టెన్స్ టీచర్ అన్నాడు ఆది.
ఇంతలో పండు వచ్చి. "పండు కప్పు కొడతాడు" అన్నాడు. దానికి ఆది "అది ఫ్యూచర్ ఇంపాజిబుల్ టెన్స్" అన్నాడు. ఇక లాస్ట్ లో పండు జడ్జిమెంట్ ఇచ్చాడు. రాజా నందినికి ఓటేశాడు. దాంతో జాను లిరి సీరియస్ గా "డాన్స్ లో ఎం బాలేదు. ఎం తక్కువయ్యిందో చెప్పు" అని పోయినాటౌట్ చేసింది." "ఎం చేసావ్ " అన్నాడు. "చూళ్ళే" అంది జాను. "షెడ్యూల్ లో గ్యాప్ ఎందుకు తీసుకున్నావ్" అన్నాడు. "రెస్ట్ తీసుకున్నా" అంది. "రెస్ట్ తీసుకుంటే ఇక్కడ అవ్వదు" అన్నాడు. "ఢీ అంటే ఏంటనుకున్నావ్" అన్నాడు సీరియస్ గా పండు. ఇక జాను ఎం చెప్పిందో కానీ వేలెత్తి వార్నింగ్ ఇచ్చాడు పండు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



