పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్!
on Sep 21, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతుంది. రెండవ వారంలో బీటెక్-రైతు అంటు పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు కాంట్రావర్సికి కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. పల్లవి ప్రశాంత్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించాడు అమర్ దీప్. అతనితో పాటు హౌజ్ లోని మిగత కంటెస్టెంట్స్ అందరు అతన్ని టార్గెట్ చేసి నామినేట్ చేశారని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసింది. అయితే ఆ వారం నామినేషన్ లో అందరు వరుసగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి, వారికి తెలియకుండానే అతడిని మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని చేసేసారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే అతను సింపథీ కోసమే అలా ప్రతిసారీ హౌజ్ లో రైతుబిడ్డ అంటూ వస్తున్నాడని తోటి కంటెస్టెంట్స్ అభిప్రాయం. అందుకే ఎక్కడ గెలుస్తాడో అని అతడిని బయటకు పంపించే పనిలో పడ్డారు. నామినేషన్ తర్వాత ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పల్లవి ప్రశాంత్ తనని తాను రైతుబిడ్డ అని చెప్పడంలో తప్పేముందని చాలా వరకు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత.. నేనొక డాక్టర్ ని, నా దగ్గర వచ్చి బాడీ చూపిస్తూ మాట్లాడతాడా అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. అయితే ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి బిగ్ బాస్ 4 రన్నర్ అఖిల్ సార్థక్.. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అందుకే రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవడం కరెక్ట్ కాదన్న వాళ్ళే ఇప్పుడు డాక్టర్ అని ఎందుకు చెప్పినట్టు అంటూ గౌతమ్ కృష్ణని ఉద్దేశించి అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇదేవిధంగా గీతు రాయల్ కూడా రైతు బిడ్డ రైతు అని చెప్పుకుంటే తప్పా? డాక్టర్ నేను డాక్టర్ అని చెప్పుకుంటే తప్పు లేదా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇప్పుడు ఆరోహీ రావు తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేయండంటూ పోస్ట్ చేసింది. ఎప్పుడు చూసిన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలతో, రీల్స్ తో యాక్టివ్ గా ఉండే ఆరోహీ రావు.. ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. అందులో బిగ్ బాస్ సీజన్-6 లో మీ బెస్ట్ మెమోరీ ఏంటని ఒకరు అడుగగా.. ఒకరోజు నేను అన్నం తినకుండా పడుకున్నాను. అందరు తినేస్తున్నారు. ఆ రోజు ఫుల్ మీల్స్ అండ్ చికెన్ వచ్చింది. ఎవరు నా కోసం వెతకట్లేదు. కానీ కీర్తీ తను తినకుండా, తన ప్లేట్ నా ప్లేట్ పట్టుకొని హౌజ్ అంతా తిరిగి నన్ను లేపి ఫుడ్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది ఆరోహీ. ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్-7 లో మీ సపోర్ట్ ఎవరికి అక్క అని ఒకరు అడుగగా.. అందులో ఉన్న అందరు టీవీల్లో, సినిమాల్లో నటించినవారే దాదాపు అందరికి పరిచయమే. కానీ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రశాంత్ కి ఎవరు లేరు. అందుకే నా సపోర్ట్ తనకే అంటు ఆరోహీ అంది. దీంతో సోషల్ మీడియాలో రోజురోజుకి పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
