జీ తెలుగులో త్వరలో పడమటి సంధ్యారాగం
on Aug 23, 2022

జీ తెలుగు ఛానల్ మరో కొత్త సీరియల్ లో త్వరలో రాబోతోంది. ఈ సీరియల్ కి సంబందించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. పడమటి సంధ్యారాగం పేరుతో ఈ సీరియల్ టైటిల్ అలరించనుంది. ఈ పేరు వినగానే ఒకప్పటి విజయశాంతి సినిమా గుర్తురాకుండా మానదు ఆడియన్స్ కి. మల్లి సీరియల్ లో హీరోయిన్ తల్లిగా నటించిన జయశ్రీ, అలాగే గుప్పెడంతమనసు సీరియల్లో మహేంద్రగా నటించిన సాయికిరణ్ భార్యాభర్తలుగా నటించారు. అలాగే పిన్ని 2 , కావ్యాంజలి సీరియల్ లో నటించిన ప్రీతి శర్మ ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తోంది. ఇంకా కన్నడ యాక్టర్ సుజిత్ గౌడ్ ఉప్పెన సీరియల్ తర్వాత ఈ సీరియల్ లో నటిస్తున్నాడు.
ఇంకా ఈ సీరియల్ లో కుంకుమ పువ్వు, గోరింటాకు, అత్తారింటికి దారేది సీరియల్స్ లో నటించిన సాత్విక్ చౌదరి, దేవత, ఉప్పెన వంటి ఎన్నో సీరియల్స్ లో నటించిన శ్వేత కనిపించబోతోంది. అలాగే కార్తీక దీపంలో నటించిన రజిత, కృష్ణ తేజ, ద్రాక్షారామం సరోజ ఇలా అభిమాన తారలు నటించిన ఈ సీరియల్ త్వరలో ప్రసారం కాబోతోంది. "ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేని ఆ మనసు వేచి ఉంది ఎవరి కోసం" టాగ్ లైన్ తో జీ తెలుగు తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఐతే ఇది హిందీ సీరియల్ సప్నే సుహానే లడక్పన్ కె అనే సీరియల్ కి రీమేక్ అంటూ, ప్రోమోలో చాలా డెప్త్ ఉంది ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



