ఓపెన్ హార్ట్ విత్ మాధురి.. రాజా ఈ బుక్ నీ కోసం
on Dec 23, 2025

ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో లాస్ట్ లో ఒక ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ ని నడిపించింది శ్రీముఖి. "మీరే మీ లైఫ్ ని ఒక బుక్ గా రాసుకుని దానికి ఒక పేరు పెట్టుకోవాలంటే ఎం పేరు పెట్టుకుంటారు" అనే టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఈ టాపిక్ మీద దివ్వెల మధురిని ఇన్వైట్ చేసింది. "మీ పుస్తకానికి మీరే ఎం పేరు పెట్టుకుంటారు ? అని శ్రీముఖి అడిగింది. "రాజారాణి అని పెడతారా ఏంటి" అని టేస్టీ తేజా అన్నాడు. "ఓహ్ మై గాడ్ ఇదొక ఇంటరెస్టింగ్ టైటిల్" అంది శ్రీముఖి. "ఓపెన్ హార్ట్ విత్ మాధురి" అని తన బుక్ కి తానే టైటిల్ పెట్టుకుంది దివ్వెల మాధురి. మరి అవినాష్ అడుగుతున్నాడు "ఓపెన్ హార్ట్ విత్ మాధురి అంటే బుక్ ని ఎలా ఓపెన్ చేయాలి" అంటూ శ్రీముఖి అడిగింది. "దగ్గరకొస్తే సమాధానం చెప్తాను" అంది మాధురి.
వెంటనే అవినాష్ ఆమె దగ్గరకు వచ్చాడు. "అవినాష్ ఈ బుక్ నువ్వైతే ఇంతకు కొనుక్కుంటావ్" అని శ్రీముఖి అడిగింది. "అసలు నేనిది అమ్మట్లేదు" అంది మాధురి. "అమ్మట్లేదు అంటూ మళ్ళీ రిపీట్ చేసాడు" అవినాష్. "లెట్ మీ ఫినిష్" అంటూ మాధురి సీరియస్ గా చెప్పి వెంటనే నవ్వేసింది. దాంతో అవినాష్ భయపడిపోయి "మాధురి గారు మీరు అంత హర్ష గా మాట్లాడకండి" అన్నాడు. "ఈ బుక్ ని సేల్ చెయ్యట్లేదు ఎందుకంటే ఒక లైలా, మజ్ను ఒక పారు , ఒక దేవదాస్ తర్వాత నేను మా శ్రీనివాస్ గారు కాబట్టి ఈ బుక్ మ్యూజియంలోకి వెళ్తుంది. దీన్ని చూసి చాలామంది లవ్ ఎలా చేసుకోవాలా అని తెలుసుకుంటారు కాబట్టి రాజా ఈ బుక్ నీ కోసం" అంటూ సిగ్గుపడుతూ చెప్పింది మాధురి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



