ENGLISH | TELUGU  
Home  » TV News

కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో రసవత్తరంగా మారుతున్న బ్రహ్మముడి సీరియల్!

on May 22, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ సీరియల్ లో లేడీ విలన్ రుద్రాణి, తన కొడుకు రాహుల్ చేసే ప్లాన్ లతో కొత్త కొత్త ట్విస్ట్ లతో సాగుతుంది. ఇక ఇప్పుడు ఈ కథలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఈ సీరియల్ లో రాబోయే ఎపిసోడ్స్ మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.

బ్రహ్మముడి సీరియల్ లో న్యూ క్యారెక్టర్ గా లహరి కశ్యప్ వస్తుంది. కోయిలమ్మ సీరియల్ తో లహరి ఫేమ్ లోకి వచ్చింది. కోయిలమ్మ లో లహరి నెగెటివ్ రోల్ తో అందరిని మెప్పించింది. కాగా బ్రహ్మముడి సీరియల్ లో నెగటివ్ రోల్ చేస్తుందా? లేక పాజిటివ్ రోల్ చేస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకులందరిలోను నెలకొంది. అయితే బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ లో.. అపర్ణ ఇంట్లో వాళ్ళతో నా ఫ్రెండ్ అరుంధతి అమెరికా నుండి ఆమె కూతురుని తీసుకొని వస్తుందని చెప్తుంది. అలా అపర్ణ ఇంట్లో చెప్పగానే వెన్నెలని రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని రుద్రాణి అంటుంది. నేను కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా అని అపర్ణ అనగానే.. అంత కోటిశ్వరులకు తన కొడుకుని అల్లుడు చెయ్యాలని రుద్రాణి ప్లాన్ తో.. రాజ్ పెద్ద వాడు వాడికి పెళ్లి అయింది.. నెక్స్ట్ రాహుల్ ని వదిలేసి కళ్యాణ్ కి పెళ్ళి చేస్తానంటారేంటి అని వాదిస్తుంది. అయితే తాజాగా వచ్చిన  ప్రోమోలో అరుంధతి తన కూతురు వెన్నెలతో కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. రుద్రాణి తన కన్నింగ్ అలోచనలతో అరుంధతిని తనవైపుకి తిప్పుకున్నా ఆశ్చర్యం లేదు.

సీరియల్ లో రాహుల్ కి వెన్నెలని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకోని ప్రయత్నం చేస్తున్న రిద్రాణి ఒకవైపు.. రాహుల్ తో స్వప్న పెళ్లి చేయాలని కావ్య ఆలోచనలు మరోవైపు. మరి ఎవరి ప్లాన్ నెరవేరుతుందో?. దీనికి తోడు అపర్ణ వెన్నెలని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఆలోచనలో ఉంది. రాహుల్ గురించి ప్రతేకంగా చెప్పక్కర్లేదు అమ్మాయి కనిపిస్తే కన్నార్పకుండా చూసే కన్నింగ్ మైండ్ సెట్. ఇక కోటిశ్వరురాలు అయిన వెన్నెలని పడగొట్టడానికి విశ్వప్రయత్నలు చెయ్యకమానడు రాహుల్. వెన్నెల ఎంట్రీతో ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారనుంది. ఇప్పుడు ఈ సీరియల్ ఏ మలుపు తిరగనుందో చూడాలి మరి.  


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.