ఓదెల 2 లో తమన్నాలా ఉన్నావ్...మంచిగున్నావ్ లేడి అఘోరాలా
on Jul 4, 2025
విరూపాక్ష మూవీలో కనిపించేది చిన్న రోల్ లో ఐనా కానీ ప్రతీ ఒక్కరి మనస్సులో మంచి స్థానం సంపాదించుకుంది సోనియా సింగ్. బుల్లితెర మీద సోనియా సింగ్ - పవన్ సిద్దు జోడి చాలా షోస్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు. రీసెంట్ గా సోనియా కాశీ వెళ్ళింది. శివుని భక్తిలో మునిగి తేలుతోంది. దానికి సంబంధించిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. "శివుడిని పట్టుకునేది నేను కాదు... నన్ను ఎప్పుడూ వదలనిది శివుడే." అంటూ కాప్షన్ పెట్టుకుంది. నెటిజన్స్ ఐతే సోనియా పిక్స్ కి కామెంట్స్ పెడుతున్నారు. "హర్ హర్ మహాదేవ..కాశీ వెళ్ళావా సిస్టర్. ఉన్న అఘోరాలు చాలు బాబోయ్. బాబు సిద్దు ఎక్కడున్నావ్ కొంచెం సూడు నాయనా.. అలా వదిలేయకు సోనిని.
సిద్దు గారు ఎక్కడున్నారు. ఓదెల 2 లో తమన్నాలా ఉన్నావ్...మంచిగున్నావ్ లేడి అఘోరాలా" అంటూ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు.సోనియా యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది. పవన్ సిద్దుతో కలిసి "రౌడీ బేబీ, హే పిల్ల" అనే యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా వీడియోస్ చేసేది. దాంతో టీవీ షోస్ లో ఆఫర్స్ వచ్చాయి. ఢీ 19 సీజన్ కి వీళ్లద్దరూ మెంటార్స్ గా వచ్చారు. విరూపాక్ష, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, శశి మధనం వంటి మూవీస్ లో నటించింది. ఒక నెల క్రితమే అరుణాచలేస్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు కాశీకి కూడా వెళ్ళొచ్చింది. ఇక "యమలీల ఆ తర్వాత" సీరియల్ లో కూడా నటించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
