వేర్ ఈజ్ దీపికా పిల్లి... అంటూ అడుగుతున్న నెటిజన్స్
on Sep 22, 2023
ఢీ ప్రీమియర్ లీగ్ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక షోకి హోస్ట్ ప్రదీప్ పవన్ కళ్యాణ్ మూవీ బ్రో నుంచి "మై డియర్ మార్కండేయ" సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చాడు. ఆ వెనకే హైపర్ ఆది చంద్రముఖి మూవీలో రజనీకాంత్ వేసిన గెటప్ వెంకటపతి రాజాలా వచ్చాడు. ఆ గెటప్ చూసి హోస్ట్ ప్రదీప్ ఒక డైలాగ్ వేసాడు. "ఐతే నీ పేరులో చిన్న కరెక్షన్... వెంకట పతి రాజా కాదు వెంకట పత్తి రాజు ఐతే కరెక్ట్ గా ఉంటుంది" అనేసరికి ఆది నవ్వేసాడు.
ఆ వెంటనే వెంకటపతి రాజు కోసం చంద్రముఖి గెటప్ లో విద్యురామన్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఆది వెనక పరిగెత్తాక "నాకు నా గుణశేఖర్ కావాలి" అని ఆదిని అడిగింది విద్యురామన్.."అదిగో ఆయనే అంటూ శేఖర్ మాష్టర్ ని చూపిస్తూనే కౌంటర్ వేసాడు...ఆయన గుణశేఖర్ కాదు..గునపం శేఖర్" అని ఆది పెద్ద డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు...దానికి ఎం అనాలో తెలియక శేఖర్ మాష్టర్ నవ్వేసాడు.
ఇక లాస్ట్ పెర్ఫామెన్స్ లో మదర్ సెంటిమెంట్ తో ఒక డాన్స్ కం స్కిట్ చేసేసరికి టీం లీడర్ కృష్ణ ఏడ్చేశాడు. దాంతో ప్రదీప్ మిగతా డాన్సర్స్ అంతా వచ్చి కృష్ణని ఓదార్చారు. "ఫైనల్ డేకి ముందు చేసిన కృష్ణ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అదే వాళ్ళ అమ్మ చూసిన లాస్ట్ పెర్ఫార్మెన్స్ అదే...వాళ్ళ అమ్మ మన మధ్య లేరు" అంటూ ప్రదీప్ చెప్పేసరికి కృష్ణ వాళ్ళ అమ్మ ఫోటో వైపు తిరిగి దణ్ణం పెట్టాడు. ఐతే కొన్ని వీక్స్ నుంచి ఈ షోలో ఆదికి జోడీగా దీపికా పిల్లి కనిపించడం లేదు...దాంతో ఫాన్స్ "వేర్ ఈజ్ దీపికా పిల్లి...పిల్లి లేని షో చూడలేకపోతున్నాం...మాకు దీపికా పిల్లి కావాలి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
