జగతి మేడం ఎంత పని చేశారు.. ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది
on Jul 29, 2025

జగతి మేడం.. ఈ పేరు వింటే గుప్పెడంత మనసు సీరియల్ గుర్తొచ్చేస్తుంది. రిషి తల్లిగా ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాటి జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు కిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక జ్యోతి లుక్స్ చూస్తే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె హాట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. "శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాష్టర్ పీస్" వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లో ఈ కిల్లర్ మూవీ రాబోతోంది. పైగా ఆ డైరెక్టర్ జ్యోతి హజ్బెండ్ కూడా. వీళ్ళ కంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఒక గ్లిమ్ప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మౌనం మాట్లాడినప్పుడు ఈ రొమాంటిక్ సీన్ వస్తుంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పని జరుగుతోంది. చాల పవర్ ఫుల్ ఐన ఒక మూవీ రాబోతోంది. మేము రా, రియల్ , రివొల్యూషనరీ మూవీని తీసుకురాబోతున్నాం" అంటూ చెప్పింది.
ఇక ఈ గ్లిమ్ప్స్ ని చూసిన నెటిజన్స్ ఐతే హాట్ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. కొంతమందైతే "జగతి మేడం ఎంత పని చేశారు..ఒక సాంగ్ అన్నా రిలీజ్ చేయాల్సింది..మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్..గుప్పెడంత మనసులో అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది...ఆమె తక్కువ టైంలోనే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు ప్రయాణిస్తోంది...బిగ్ స్క్రీన్ మీద త్వరగా చూడాలని ఆశగా ఉంది " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక కిల్లర్ సిరీస్ లో ఫస్ట్ పార్టీ "కిల్లర్ పార్ట్ 1 - డ్రీమ్ గర్ల్" రిలీజ్ కాబోతోంది. ఇందులో ఒక అద్దంలో రోబో కనిపిస్తుంది. మరో వైపు జ్యోతి ఒక చేత్తో కూరగాయల బుట్ట, మరో చేత్తో గొడ్డలి పట్టుకుని నిలబడి ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



