Home

»

Tv News

Neethu Remuneration: నీతూ మాస్టర్‌ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nov 23, 2026 9:12AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్ గా హౌస్‌లోకి అడుగుపెట్టింది నీతూ మాస్టర్. నిన్నటి ఎపిసోడ్ అంటే 11వ వారంలో ఎలిమినేట్ అయ్యి తన జర్నీని ముగించింది నీతూ మాస్టర్. నటరాజ్ మాస్టర్ భార్యగా, కొరియోగ్రాఫర్‌గా ఇప్పటికే ఫేమస్ అయిన నీతూ.. హౌస్‌లోకి రాగానే తన ఫైర్ బ్రాండ్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిగుణ్, వంశీలతో గొడవలు, డిక్టేటర్ టాస్క్‌లో తన పాయింట్‌ను గట్టిగా చెప్పడం, ఫ్యామిలీ వీక్‌లో భర్త, కూతురితో ఎమోషనల్ మూమెంట్స్.. ఇలా ఆరు వారాల్లోనూ నీతూ హౌస్‌లో ఫుల్ యాక్టివ్‌గా కనిపించింది. బయటకు వెళ్తూ కూడా త్రిగుణ్, అమన్, శివ్ గేమ్ బాగా ఆడుతున్నారని ప్రశంసించి, వర్షిణి, ముఖేష్, సుధీర్ గేమ్ ఆడట్లేదని కుండబద్దలు కొట్టింది. హౌస్‌లో ఉండలేకపోయాను, వెళ్లిపోవాలని కోరుకున్నానని చెప్పి అందరిని షాక్‌కి గురిచేసింది.

 

అయితే నీతూ ఎలిమినేట్ అయ్యాక ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. బిగ్ బాస్‌లో సాధారణంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కు రెగ్యులర్ కంటెస్టెంట్స్ కంటే కాస్త ఎక్కువ పారితోషికం ఇస్తారని టాక్. ఎందుకంటే వాళ్లు మధ్యలో వచ్చి తక్కువ సమయంలోనే హౌస్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. నీతూ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. ఆమెకు వారానికి లక్షకు పైనే రెమ్యునరేషన్ ముట్టిందని, మొత్తం ఆరు వారాలకు కలిపి లక్షల్లోనే అందుకుందని సోషల్ మీడియాలో లెక్కలు వేస్తున్నారు.

 

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్ ఆరు వారాల పాటు హౌస్ లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కొరియోగ్రాఫర్స్ మరియు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కి వారానికి సుమారు 1.2 లక్షల నుండి 1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆరు వారాలకు గాను ఆమెకు సుమారు 7.2 లక్షల నుండి 9 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com