Home

»

Tv News

Neethu Buzz interview:బజ్ ఇంటర్వ్యూలో త్రిగుణ్ కి విన్నర్ అర్హత లేదని చెప్పిన నీతూ మాస్టర్!

Nov 23, 2026 8:45AM

బిగ్ బాస్ సీజన్-10 లో పదకొండో వారాం వీకెండ్ లో నీతూ మాస్టర్ ఎలిమినేషన్ జరిగింది. అయితే నీతూ ఎలిమినేషన్ తర్వాత శివాజీ గారితో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది నీతూ. తను ఏం మాట్లాడిందో ఓసారి చూసేద్దాం.

బజ్ ఇంటర్వ్యూకి వచ్చీ రాగానే ఈ ఆరు వారాల జర్నీ ఎలా అనిపించిందమ్మా అని శివాజీ అడుగగా.. అంటే అక్కడ సర్వైవ్ అవుతే ఇంకా ఎక్కడైనా సర్వైవ్ అవ్వొచ్చని నీతూ అంది. త్రిగుణ్ నిన్ను వీక్ కంటెస్టెంట్ లిస్ట్ లో పెట్టాడుగా ఎందుకు డిఫెండ్ చేసుకోలేదని శివాజీ అనగానే అంతా అక్కడ డిక్టేటర్స్ టాస్క్ జరుగుతుంది.. డిక్టేటర్ చెప్పినదానికి ఎదురుతిరిగి మాట్లాడకూడదంటూ టాస్క్ గురించి చెప్పింది నీతూ. హౌస్ లో చెత్త మెంటాలిటీ ఎవరు.. వారి ఫోటోలని చింపి ఈ చెత్తబుట్టలో వేయండి అని శివాజీ అన్నాడు. మొదటగా దేబ్జానీ ఫోటోని చింపి చెత్తలో వేసింది నీతూ. అలియన్స్ తో ముందుకు వెళ్తుంది తను.. ఎక్కడ తను గేమ్ విన్ అవ్వలేదని నీతూ అంది. ఆ తర్వాత సుధీర్ ఫోటోని చెత్త బుట్టలో వేసేసింది నీతూ. నారాయణ.. నారాయణ అంటు అక్కడి ముచ్చట్లు ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్తుంటాడు. నటరాజ్ మాస్టర్ వచ్చి అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడని నీతూ అంది‌. 

ఆ తర్వాత త్రిగుణ్ ఫోటోని చింపేసి చెత్తబుట్టలో ఒ

పడేసింది నీతూ. ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదు సర్. అతని గురించి అన్ని విషయాలు చెప్పుకుంటు వచ్చింది. చివరగా అతడికి విన్నర్ అయ్యే అర్హత మాత్రం లేదని నీతూ అంది. ఇలా హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పుకొచ్చింది నీతూ. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com