Home

»

Tv News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటరాజ్ మాస్టర్..టీనేజ్ బాయ్‌లా సరికొత్త అవతారం!

Jun 1, 2026 4:29PM

డిస్నీ హాట్ స్టార్ లో కపుల్స్ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎంత సెన్షేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు కదా. ఇందులో ముఖ్యంగా నటరాజ్ మాష్టర్ - నీతూ జోడి ఒక వైపు మిగతా జోడీలు ఇంకో వైపు అన్నట్టుగా సాగింది. ఎందుకంటే నటరాజ్ మాష్టర్ ఏ ప్రోబ్లం వచ్చినా హైపర్ ఐపోయి తిట్టేస్తూ ఉంటె నీతూ పక్కనుంచి కూల్ చేస్తూ ఉండేది. అలాంటి నటరాజ్ మాష్టర్ హెయిర్ స్టైల్ ఆడియన్స్ కి బాగా గుర్తు ఉండే ఉంటుంది.

ఆయనది కర్లీ హెయిర్ ..రింగుల జుట్టు . అలాంటి జుట్టును ఇప్పుడు నటరాజ్ మాష్టర్ మార్చేశారు. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి ఫాన్స్ అంతా షాకయ్యారు. ఏంటి నటరాజ్ మాష్టర్ ఏనా మీరు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన కర్లీ హెయిర్ ని సాఫ్ట్ గా మార్చేశారు. దాంతో ఫేస్ కూడా చాలా మారిపోయింది.

ఇప్పుడు ఆయన ముఖ చిత్రం చూస్తే లవ్ మాన్షన్ లో అంత హైపర్ అయ్యింది ఈయనా అనిపించేలా ఉన్నారు. ఆ పిక్స్ ని పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ అంతా కూడా ఫిదా ఐపోతున్నారు. "మళ్ళీ ఇలా హెయిర్ స్టైల్ చేయించుకోనా ?"అని అడిగేసరికి నటి ప్రియా ఐతే అదిరింది మాష్టర్ మీ లుక్ అంది. ప్రియాంక ఐతే మాష్టర్ ఆన్ ఫైర్ అంటూ ఎమోజి పెట్టింది. మిగతా నెటిజన్స్ ఐతే "మాష్టర్ చాలా బాగున్నారు. టీనేజ్ బాయ్ లా ఉన్నారు మాష్టర్. వావ్ నటరాజ్ మాష్టర్ లుక్స్ గుడ్. ఈ స్టైల్ సూపర్ . ఇలాగే బాగున్నారు ఇలానే చేయించుకోండి. సూపర్ గా ఉంది మాష్టర్ లుక్ ఇలానే చేయించుకోండి. "అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com