.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -283..... నా శ్రీమంతం రుద్ర అన్నయ్య గంగ, వదినల చేతులు మీదుగా జరగాలి.. అందుకే వదిన బాక్సింగ్ పోటీ అయ్యాక శ్రీమంతం చేసుకుంటానని ప్రీతీ అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్.. నేను ఏర్పాట్లు చేస్తాను కదా అని వీరు అంటాడు. అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.. మీరు ఏదో ఒకసారి వచ్చి పలకరించి వెళ్తారు కానీ అన్నయ్య నన్ను చూసుకోమని వదినకు చెప్పినప్పటి నుంచి తన చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
ఒక అమ్మలా చూసుకుంటుందని ప్రీతీ అనగానే శకుంతలకి కోపం వస్తుంది. ఆ మాటలకి గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత గంగ గదిలోకి వెళ్లి ప్రీతీ మాటలకూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే రంగా వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అది ఏడవడం కాదు సంతోషమని రుద్ర అంటాడు. చాలా థాంక్స్ గంగ.. నువ్వు ప్రీతిని చాలా బాగా చూసుకుంటున్నావని రుద్ర అంటాడు. ఆ తర్వాత గంగ నుదుటిపై రుద్ర ముద్దు పెట్టినట్లు ఉహించుకుంటుంది గంగ. అప్పుడే రంగా మిరపకాయలు తీసుకొని వస్తాడు. దాంతో గంగ బాక్సింగ్ కి వెళ్తుందని దిష్టి తీస్తాడు. మరొకవైపు గంగ కాంపిటీషన్ కి సెలెక్ట్ అవ్వాలని సుధా పూజ చేస్తుంది. విశ్వ వచ్చి ఏంటి ఈ రోజు పూజ చేస్తున్నావని అంటాడు. మీరు సెలక్షన్ ఆఫీసర్ గా వెళ్తున్నారు కదా అంతా మంచే జరగాలని సుధా అంటుంది. అది విషయం కాదని నాకు తెలుసని విశ్వ అంటాడు. గంగ తప్పకుండా సెలెక్ట్ అవుతుంది. మీరు తన పట్ల కోపం చూపించకూడదని సుధా అంటుంది. అది తన బిహేవియర్ పై ఆధారపడి ఉంటుందని విశ్వ అంటాడు.
ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి వీరు, ఇషిక వస్తారు. ఏంటి ప్రీతీ.. అత్తయ్య నీ మాటలకి బాధపడిందని ఇషిక అంటుంది. అసలు నువ్వు ఎప్పుడైన కనీసం జ్యూస్ అయినా నాకు ఇచ్చావా .. ఇప్పుడు వచ్చి శ్రీమంతం మేం చేస్తామని అంటున్నారు.. నువ్వు నా విషయంలో కలుగజేసుకోకు అని ఇషికతో ప్రీతి చెప్తుంది. దాంతో ఇషిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రీతీ అలా మాట్లాడావ్ ..ఇషిక నాకు ఎంత సపోర్ట్ గా ఉంటుందో తెలుసు కదా అని వీరు అంటాడు. మీరు ఇషిక ఇంట్లో వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తున్నారు.. ఆ విషయం మాకు తెలియదా అని ప్రీతీ అంటుంది. దాంతో వీరుకి కోపం వస్తుంది. ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి పెద్దసారు వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
