Podharillu: మహాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన భూషణ్!
on Dec 23, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -11 లో....మహా దృష్టిలో పడడానికి చక్రి చాలా కష్టపడుతాడు. అన్ని రకాల షర్ట్స్ వేసుకొని వచ్చి మరి ఇంప్రెస్ చెయ్యాలని చూస్తే కనీసం తన వంక చూడను కూడా చూడదు మహా. హారిక ఒక చీర సెలక్ట్ చేస్తే రెడ్ కలర్ అంటే నచ్చదు వాడికి అని భూషణ్ వాళ్ళ అమ్మ అనగానే మంచి పాయింట్ దొరికిందని వెళ్లి నాకు ఈ రెడ్ కలర్ చీర బాగా నచ్చిందని మహా అంటుంది. ఇది మా వాడికి నచ్చదని వాళ్ళ అమ్మ అంటుంది.
పర్లేదులే అమ్మ కట్టుకునేది తనే కదా.. తన ఇష్టం అనగానే మహా షాక్ అవుతుంది. మరొకవైపు మాధవ మేస్త్రి పనికి వెళ్తాడు. అక్కడ అందరు నీ పెళ్లి ఫిక్స్ అయిందా అని అడుగుతుంటే మాధవ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు వాళ్ళ చెల్లి, అన్న దగ్గరికి నారాయణ వెళ్తాడు. నా కొడుకుకి వచ్చిన సంబంధం కాన్సిల్ చేస్తారా అని గొడవకి దిగుతాడు. మాధవకి విషయం తెలిసి వెళ్లి నారాయణని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత నిన్నటి నుండి పెళ్లి అంటున్నారు ఎవరికి అని ఆదిని చక్రి అడుగుతాడు. నా చెల్లికి అని ఆది చెప్తాడు. హారిక అనుకొని కంగ్రాట్స్ చెప్తాడు. అయ్యో నాకు పెళ్లి అయింది. ఆయనే నా భర్త అని హారిక చెప్తుంది. మహాని చూపించి తనే నా చెల్లి.. ఈ పెళ్లి తనకే అని అనగానే చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత భూషణ్ తో నువ్వు మాట్లాడమని మహాకి చెప్తుంది హారిక.
భూషణ్ దగ్గరికి ఆది వెళ్లి బావ మీరు ఇద్దరు అలా బయటకు వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకొండి అని చెప్తాడు. మహా, భూషణ్ ని చక్రి బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు జాబ్ చెయ్యాలని ఉందని తన డ్రీమ్స్ అన్ని మహా చెప్తుంటే.. అవసరం లేదు నాకు నచ్చింది చేస్తూ ఇంట్లో ఉంటే చాలని భూషణ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో వీసాకీ అప్లై చెయ్యాలంటే మహాని ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని భూషణ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



