
బిగ్ బాస్ సీజన్-10 నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ ఫోటోలున్న కుండలను తీసుకొచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ చేసిన తప్పులను చెప్తూ వారి ఫోటో ఉన్న కుండని పగులగొట్టాడు. సుధీర్ కుండని మొదటగా పగులగొట్టాడు. ఆ తర్వాత వర్షిణి, ముఖేష్, రామ్ ప్రసాద్, శ్వేత, రామకృష్ణ ఇలా అందరి ఫోటోలు ఉన్న కుండలని పగులగొట్టాడు నాగార్జున.
మొదటగా వంశీ కెప్టెన్ అయినందుకు అతడికి కంగ్రాట్స్ చెప్తాడు. ఆ తర్వాత అతడి గేమ్ బాగా ఇంప్రూవ్ అయిందని, మాట్లాడే చోట మాట్లాడుతున్నావని పొగిడేశాడు నాగార్జున. నీ కెప్టెన్సీ లో హౌస్ లో ఏం చేద్దామని అనుకుంటున్నావని నాగార్జున అడుగగా హౌస్ లో డిసిప్లేన్ తో పాటు హౌస్ ఆర్మని బాగా ఉండేలా చూసుకుంటానని వంశీ అనగానే సూపర్ అని నాగార్జున చెప్పాడు.
ఆ తర్వాత ముఖేష్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను నాగార్జున చూపించాడు. దేబ్జానీని ముఖేష్ కాలితో తన్నిన వీడియోని చూపించాడు. దీనిపై వర్షిణిని అడగ్గా.. అతను దేబ్జానీని కాకుండా ఆమె బ్యాగ్‌ను తన్నేందుకు ప్రయత్నించాడని చెప్పింది. దాంతో త్రిగుణ్ నవ్వేశాడు. అక్కడ క్లియర్ గా ఉంది కదా అమ్మా అని నాగార్జున అడుగగా తప్పే సర్ అని వర్షిణి అంది. ముఖేష్ కూడా తన చర్య తప్పేనని అంగీకరించాడు. అయితే దేబ్జానీని కావాలని తన్నలేదని వివరణ ఇచ్చాడు. నీతూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కోపంలో కాలు ఎత్తడం కూడా తప్పేనని నాగార్జున స్పష్టం చేశాడు.
అయితే ముఖేష్ మాత్రం అది తన స్ట్రాటజీ అని అలా తన్నితే ఆమె అటు తప్పుకొని తిరిగితే ఆమె వెనుకాల ఉన్న బ్యాగ్ ఇటు వైపు వస్తుందని అలా చేశానని ముఖేష్ అనగా అది నీ స్ట్రాటజీ అని ఆమెకు తెలియదు కదా.. నువ్వు తన్నావనే మేము అనుకున్నామని నాగార్జున అన్నాడు. దాంతో సారీ సర్ అని ముఖేష్ అన్నాడు.
ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిజికల్ అవ్వడంపై సంచాలక్‌గా ఉన్న శివని అడిగాడు నాగార్జున. సర్ నాకు అసలు కనపడలేదని అన్నాడు. అందరిని లైన్ లోపల ఉండేలా చేయడమే కాదు శివ.. ఎక్కడ ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారో స్పష్టంగా చూడాలి కదా అని నాగార్జున చెప్పాడు. సారీ సర్ అని శివ కుమార్ చెప్పాడు.
ఆ తర్వాత ముఖేష్, వర్షిణి కుండలని పగులగొట్టాడు నాగార్జున. వర్షిణి నీ గేమ్ సరిగ్గా ఆడటం లేదని.. వంద శాతం ఎఫర్ట్స్ కావాలని ఇలా అయితే కష్టమని నాగార్జున తన ఫోటో ఉన్న కుండని పగులగొట్టాడు.
[Bigg Boss Telugu 10, Bigg Boss Mukesh, Bigg Boss Varshini, Bigg Boss Debjani, Akkineni Nagarjuna, Telugu TV News]






