
బిగ్ బాస్ సీజన్-10 నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని బట్టి వారి ఫోటోలతో ఉన్న కుండలని పగులగొట్టాడు నాగార్జున. దేబ్జానీ మీదకి ముఖేష్ కాలు ఎత్తిన వీడియోని ప్లే చేసి చూపించాడు. ఆ తర్వాత దేబ్జానీ మాట్లాడిన మాటలని వీడియో వేసి మరీ చూపించాడు. ఆ తర్వాత నీతూ మాస్టర్ త్రిగుణ్ గురించి పిసుక్కోవడం గురించి మాట్లాడాడు.
కెమెరా ముందుకి వెళ్ళి ముఖేష్ గురించి త్రిగుణ్ పాట పాడుతూ అతని చేతులను పట్టుకున్న సందర్భానికి సంబంధించిన వీడియోను నాగార్జున చూపించాడు. ఆ సమయంలో త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు, అతని ప్రవర్తనపై చర్చ జరిగింది. "చేతులు పిసుక్కుంటాడు.. రాత్రి అయితే పడుకోడు.. పొద్దున్నే పని చేయడు." అంటూ ముఖేష్ గురించి త్రిగుణ్ పాడిన లిరిక్స్ వీడియోని ప్లే చేసి మరీ చూపించాడు. దాంతో అందులో నీతూ మాస్టర్ ది తప్పు ఉందని నాగార్జున ఇష్యూ క్లోజ్ చేశాడు.
ఆ తర్వాత నామినేషన్లో వర్షిణిని ఉద్దేశించి చీప్ క్యారెక్టర్ అంటూ త్రిగుణ్ మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు హౌస్‌లోని వారిని నియంత్రించాల్సిన బాధ్యత నీపై ఉందని, అలాంటిది నువ్వే ఇతరుల గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వనని త్రిగుణ్ అన్నాడు. ఆటలో ప్రతిభ చూపించడంతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమని నాగార్జున చెప్పాడు. అలా మాట్లాడటంతో త్రిగుణ్ స్థాయి తగ్గిందని, అక్కడ నుండి కిందకి పడిపోయావని అతని ఫోటో ఉన్న కుండని పగులగొట్టాడు నాగార్జున. అదే సమయంలో కెప్టెన్‌గా అతను బాగా చేశాడంటూ మిగతా కంటెస్టెంట్లతో చప్పట్లు కొట్టించాడు నాగార్జున.
నరేష్‌కు సంబంధించిన టాస్క్ నిర్ణయం కూడా చూపించాడు నాగార్జున. గతంలో సంఛాలక్ గా వ్యవహరించిన సమయంలో తన నిర్ణయం తప్పని తేలితే ఫ్యామిలీని త్యాగం చేస్తానని నరేష్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియోను మళ్లీ చూపించిన నాగార్జున.. టాస్క్‌లో ముఖేష్ ఏర్పాటు చేసిన బ్రిక్స్ ఐదు పూర్తికాకముందే కిందపడిపోయాయని వివరించాడు. శివ్, అమన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో నరేష్ తీసుకున్న నిర్ణయం తప్పని తేల్చిన నాగార్జున.. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి రాలేరని చెప్పాడు.
అయితే అమన్, రామకృష్ణ కుటుంబాల్లో ఎవరి ఫ్యామిలీ రావాలో నిర్ణయించే అవకాశం నరేష్‌కు ఇచ్చాడు. అమన్ కుటుంబం రావాలని కోరుకున్న నరేష్.. తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరివరకు హౌస్‌లో ఉంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పాడు.
చివర్లో నామినేషన్లలో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లను నాగార్జున గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు. రామ్ ప్రసాద్, సుధీర్, నీతూ, శివ్, అమన్, ముకేష్, వర్షిణి, నరేష్‌ల కోసం ఓ ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశాడు. ఇందులో కంటెస్టెంట్ల పేర్ల వెనుక వారి కుటుంబ సభ్యుల ఫొటోలను ఉంచారు. ఆ ఫొటోల్లో తమ కుటుంబ సభ్యులు కనిపిస్తే వారు సేఫ్ అయినట్లు, లేకపోతే నామినేషన్లలోనే కొనసాగినట్లు చెప్పాడు. ఈ టాస్క్‌లో అమన్ కుటుంబంతో ఫొటో కనిపించడంతో అతను సేఫ్ అయ్యాడు. మిగిలిన ఏడుగురు మాత్రం ఇంకా నామినేషన్లలోనే ఉన్నారు.
[Bigg Boss 10 Trigun Neetu Master Issue, Bigg Boss 10 Naresh Family Week Sacrifice, Bigg Boss Telugu 10, Akkineni Nagarjuna, Bigg Boss 10 Telugu, Bigg Boss Trigun, Bigg Boss Varshini, Bigg Boss Naresh, Telugu TV News]






