
బిగ్ బాస్ సీజన్-10 తెలుగు నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్ల ప్రవర్తన, టాస్కుల్లో జరిగిన గొడవలపై నాగార్జున ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా దేబ్జానీ, ముఖేష్, నీతూ, వంశీ, త్రిగుణ్‌లకు సంబంధించిన వీడియోలను చూపించాడు. మరోవైపు నరేష్ తీసుకున్న నిర్ణయం వల్ల అతని ఫ్యామిలీ వీక్ అవకాశాన్ని దూరం చేసింది. చివర్లో నామినేషన్లలో ఉన్న ఎనిమిది మందిలో అమన్ సేవ్ అయ్యాడు.
కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలిచిన నాగార్జున.. వారి ఆటతీరుపై మాట్లాడారు. తప్పులు చేసినవారి కుండలను పగలగొడుతూ తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. సుధీర్‌కు బెటర్ కాదు.. బెస్ట్ ఇవ్వాలని చెప్తూ అతని కుండను పగలగొట్టారు. ఆ తర్వాత దేబ్జానీ వంతు వచ్చింది. ఆమె తన ఆటకు పది మార్కులకు ఎనిమిది ఇస్తానని చెప్పడంతో, గతంలో ముఖేష్ గురించి చేసిన ఫౌల్ వర్డ్స్ గురించి వీడియో చూపించాడు నాగార్జున. అందులో సాలా, మగాడే కాదు అని దేబ్జానీ అన్నట్టుగా ఉంటుంది. అది తప్పు ముఖేష్ కి క్షమాపణ చెప్పు అనగానే సారీ అని ముఖేష్ తో చెప్పింది దేబ్జానీ. హౌస్‌లో ఆడ, మగ అనే తేడా లేదని అందరు సమానంగా ఆడాలని చెప్పారు.
అయితే తనపై పలువురు అబ్బాయిలు దాడి చేసిన సందర్భంలోనే అలా మాట్లాడానని దేబ్జానీ అంది. కోపంలో మాటలు జారకూడదు.. అప్పుడే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో అర్థమవుతుందని దేబ్జానీకి నాగార్జున చెప్పగా.. సారీ సర్ ఇంకోసారి రిపీట్ చేయనని చెప్పింది. దేబ్జానీతో రామ్ ప్రసాద్ కూడా చెప్పినట్టుగా చెప్పాడు. దేబ్జానీ ఏడ్చేసింది. తన కుండని పగులగొట్టాడు నాగార్జున. గేమ్ మరింత బాగా ఆడాలని నాగార్జున అన్నాడు.
[Nagarjuna Fires On Debjani, Bigg Boss Telugu 10, Bigg Boss 10 Telugu, Akkineni Nagarjuna, Debjani Modak, Bigg Boss Aman, Telugu TV News]






