మణిరత్నంగారి ఇంటి బయట నెల రోజులు నిలబడ్డ నాగార్జున
on Aug 16, 2025

గీతాంజలి మూవీ అంటే ఇష్టపడని తెలుగు ఆడియన్స్ లేరు. ఆ మూవీతో నాగార్జునకు సొంత ఇమేజ్ అనేది వచ్చింది. ఐతే ఆ మూవీ తెలుగులో రిలీజ్ కావడానికి రీజన్ నాగ్. ఆ విషయాలను జయమ్ము నిశ్చయమ్మురా షోలో జగపతి బాబుతో కలిసి షేర్ చేసుకున్నారు. "చాలా వేరియేషన్స్ తో మూవీస్ చెసావ్వు. చాలామంది ఆడియన్స్ కి అసలు కొంతకాలం నువ్వు చేసే మూవీస్ ఏంటో అర్ధమే కాలేదు. విక్రమ్, శివ, గీతాంజలి, అన్నమయ్య, హలో బ్రదర్, మనం..ఒకదానికి ఒకటి పొంతన లేని డిఫరెంట్ మూవీస్...ఏంటి ఆ విషయాలు" అని జగపతి బాబు అడిగేసరికి. "విక్రమ్ ఫస్ట్ ఫిలిం కానీ దాని గురించి నాకు అంత పెద్దగా తెలీదు. ఫస్ట్ ఫిలిం కదా నువ్వు చేస్తే బాగుంటుంది అని నాన్న గారు అన్నారు. మూవీ బాగా ఆడింది. కానీ అది కేవలం నాగేశ్వరరావు గారి అబ్బాయి చూద్దాము ఎలా చేస్తాడో అని ఆడియన్స్ చూసారు ఆడింది. అంతకు తప్పితే ఆ సినిమాలో ఏమీ లేదు. ఆ తర్వాత ఒక ఏడూ సినిమాలు చేసాను..వాళ్ళు చెప్తున్నారు ఏదో చేయమంటున్నారు.
ఆ మధ్యలో కలెక్టర్ గారి అబ్బాయి వచ్చింది నాన్నతో చేసాను. తర్వాత మజ్ను మూవీ వచ్చింది దాసరి నారాయణరావు గారితో చేశాను. మజ్ను అనే మూవీ నాకు బ్రేక్ ఇచ్చింది. నాలో నటుడు ఉన్నాడు అని ఆడియన్స్ కి తెలిసింది. మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఆఖరి పోరాటం నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ అంటే రాఘవేంద్ర రావు గారు శ్రీదేవి గారు మాత్రమే కనిపిస్తారు. నేను ఒక బొమ్మలా ఉన్నాను అంతే. నేను చేసేవే నాకు నచ్చట్లేదు అప్పటివరకు. అప్పుడు నేను మణిరత్నం గారి వెనక పడ్డాను. ఆయన తీసిన మౌన రాగం చూసా..ఆయన ఆలోచనలు నాకు సూట్ అవుతాయి అనిపించి చెన్నైలో ఆయన వెనక పడడం స్టార్ట్ చేశాను. ఉదయం 6 గంటలకు వాకింగ్ కి వెళ్తారు అని తెలిసి అంతకు ముందే నేను ఆయన ఇంటి బయటకు నిలబడేవాడిని. ఆయనతో కలిసి పది నిమిషాలు వాక్ చేసేవాడిని. తరువాత ఆయన టెన్నిస్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత ఆయన్ని కన్విన్స్ చేశా అలా గీతాంజలి మూవీ బయటకు వచ్చింది. ఐతే ఆయన తమిళ్ లో చేస్తాను అన్నారు ముందు. ఐతే మీకు ఎలాగో తమిళ్ లో మార్కెట్ ఉంది. తెలుగులో చేసి మార్కెట్ పెంచుకోండి అని ఐడియా ఇచ్చాను. అలా ఆయనకు విపరీతమైన మార్కెట్ పెరిగింది. నాకు హిట్ వచ్చింది." అని చెప్పారు నాగార్జున.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



