ముకుంద కుట్ర రేవతికి తెలిసేనా!
on Jan 25, 2023
'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఇప్పుడు 62 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో ముకుంద మళ్ళీ ఇంటికి రానని కచ్చితంగా చెప్పడంతో రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ముకుందని ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ కృష్ణ వస్తుంది. కృష్ణ రావడంతోనే ముకుంద తల్లి కోపంగా మాట్లాడి కృష్ణని బాధపెడుతుంది. "నువ్వేనా ఆ అడవిపిల్లవి" అని ముకుంద అమ్మ అంటుంది. అలా అనగానే "మీరు అనుకుంటున్న ఆ అడవి పిల్లని నేనే.. మీ పట్నం పిల్లని పిలవండి" అంటూ ముకుంద తల్లికి కౌంటర్ వెయ్యడంతో... నీ వల్ల నా కూతురికి ఇన్ని కష్టాలు అని కృష్ణని అవమానిస్తుంది. అయినా ముకుందను కలుస్తుంది. మన ఇంటికి వెళ్దాం పదా అని అడుగుతుంది. "మన ఇల్లు కాదు... మీ ఇల్లు... నా హక్కులు... నా బాధ్యతలు... నా వస్తువులు లాగేసుకున్నావ్ ఇంకెందుకు రావాలి" అని ముకుంద అంటుంది. "నేనేం లాగేసుకున్నాను.. నీ వస్తువులు ఏమైనా నా దగ్గర ఉండి పోతే నీది నీకే ఇచ్చేస్తా" అని కృష్ణ అంటుంది. దానికి ముకుంద మనసులో నా మురారిని లాగేసుకున్నావ్ అనుకుంటుంది. ముకుంద తండ్రి కలుగజేసుకుని వెళ్ళమని సర్ది చెప్తాడు.. దానికి ముకుంద నేను వస్తాను కృష్ణ... కాకపోతే పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే వస్తా అని మురారిని దృష్టిలో పెట్టుకొని ముకుంద అంటుంది. ఓహో ఇంకెవరు ఇంట్లో పెద్దావిడ వచ్చి పిలిస్తే వస్తుందేమో అని కృష్ణ అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరోవైపు మురారి ఇంటి దగ్గర "ముకుంద.. మా ఇద్దరి ప్రేమాయాణం గురించి కృష్ణకి చెప్తుందా" అని టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి... "నేను వెళ్లినా రానని చెప్పింది. పిలవాల్సిన వాళ్లు పిలిస్తే వస్తుందట" అని అనగానే "అది నేనే" అని మురారి అనుకుంటాడు. తన ప్రేమకి కృష్ణ, రేవతిలు అడ్డుగా ఉన్నారని.. వాళ్ళు మళ్ళీ తన గురించి అనుమానించకూడదని అలా ప్లాన్ వేస్తుంది. ఇంతకీ మురారి వెళ్లి ముకుందని తీసుకొస్తాడా లేదా అనేది తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read